Asianet News TeluguAsianet News Telugu

మహేష్ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్? వద్దంటున్న ఫ్యాన్స్!

 అయితే స్టార్స్ సినిమాలు ఓటీటీ అంటే రికవరీ ఉండదు. అంతంత బడ్జెట్ పెట్టి తీసే సినిమాలకు ఎంత రేటు పెట్టి కొనగలవు ఓటీటి వాళ్లు. ఓ సారి ఓటీటిలో డైరక్ట్ రిలీజ్ వస్తే తర్వాత థియోటర్ రిలీజ్ అనేది సున్నా. అయితే ఇప్పుడు మహేష్ సినిమా ఒకటి డైరక్ట్ ఓటీటికు రెడీ అవుతోందని సమాచారం. 

Mahesh Maharishi tamil version OTT release?
Author
Hyderabad, First Published May 27, 2020, 1:42 PM IST

ఇప్పుడు చాలా చిన్న సినిమాలు ఓటీటిలకు వెళ్తున్నాయి. అందులో తప్పేమీ లేదు. వడ్డీలు కట్టుకుంటూ ఎప్పుడు థియోటర్ లు తెలుస్తారా..తమ సినిమా రిలీజ్ చేసుకునేందుకు ఎప్పుడు అవకాసమిస్తారో తెలియని పరిస్దితుల్లో ఇది బెస్ట్ ఆఫ్షన్. ఎందుకంటే చిన్న సినిమాలు మామూలు రోజుల్లో కూడా థియోటర్స్ దొరకటం కష్టమే. అన్ సీజన్ లో రిలీజ్ చేసుకోవాలి. అసలే చిన్న సినిమా...దానికి తోడు అన్ సీజన్ అంటే ఇంక చూసేదెవరు. దానికన్నా ఎంతో కొంత ఇచ్చి పూర్తి నష్టపోకుండా ఓటీటి బాట పట్టడమే బెస్ట్ అనుకుంటున్నారు. అయితే స్టార్స్ సినిమాలు ఓటీటీ అంటే రికవరీ ఉండదు. అంతంత బడ్జెట్ పెట్టి తీసే సినిమాలకు ఎంత రేటు పెట్టి కొనగలవు ఓటీటి వాళ్లు. ఓ సారి ఓటీటిలో డైరక్ట్ రిలీజ్ వస్తే తర్వాత థియోటర్ రిలీజ్ అనేది సున్నా. అయితే ఇప్పుడు మహేష్ సినిమా ఒకటి డైరక్ట్ ఓటీటికు రెడీ అవుతోందని సమాచారం. 

అదేంటి ఇప్పుడు మహేష్ సినిమా ఏదీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ లేదు కదా.మరి ఓటీటీ ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా. అయితే అసలు విషయం ఏమిటంటే..మహేష్ నటించిన మహర్షి సినిమా తమిళ వెర్షన్ 'రిషి' ని భారీగా తమిళంలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ తమిళనాట కరోనా విజృంభణ మామూలుగా లేదు. అది కంట్రోలోకి వచ్చి థియోటర్స్ తెరిచేసరికి చాలా కాలం పడుతుంది. దాంతో డబ్బింగ్ రైట్స్ తీసుకునన్న వాళ్లు ఈ సినిమాని డైరక్ట్ ఓటీటిలో రిలీజ్ చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చి ,సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అది ఈ వార్త తమిళనాడులో ఉన్న మహేష్ అభిమానులకు రుచించటం లేదు.  థియోటర్ రిలీజ్ చేయాల్సిందే అని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. 
 
ఇక మహర్షి విషయానికి వస్తే.. సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ఎపిక్‌ బ్లాక్ బస్టర్ ‘మహర్షి’ . వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. మహేష్‌ ట్రెమండస్‌ పెర్‌ఫార్మెన్స్‌, వంశీ పైడిపల్లి ఎక్స్‌లెంట్‌ టేకింగ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా భారీ నిర్మాణ విలువలు చిత్రాన్ని ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios