దర్శకుడు మహేష్ భట్ పై యువ నటి సంచలన ఆరోపణలు చేసింది. ఆయన వలన తన కుటుంబానికి ప్రమాదం ఉన్నట్లు  తెలియజేశారు. ఓ వీడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. లువైనా లోధ్ దర్శకుడు మహేష్ భట్ పై ఈ ఆరోపణలు చేయడం జరిగింది. మహేష్ భట్ పరిశ్రమలో అక్రమ కార్యకలాపాలు నెరిపే డాన్ గా ఆమె వర్ణించారు. 

బాలీవుడ్ లో అమ్మాయిల సప్లై నుండి డ్రగ్స్ వంటి దురాచారాల వరకు ఆయన కనుసన్నలలో జరుగుతాయని ఆమె తెలియజేశారు . మహేష్ భట్ మేనల్లుడు సుమిత్ సబర్వాల్ ని లువైనా ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా చెప్పడం విశేషం.అతనితో విడాకులకు అప్లై చేసినట్లు ఆమె చెప్పారు. మేనల్లుడు ద్వారా బాలీవుడ్ లో మహేష్ భట్ అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.  మహేష్ ఫ్యామిలీ నుండి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వీడియో విడుదల చేసిన నేపథ్యంలో...,మహేష్ భట్ తరపు న్యాయవాది స్పందించారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I m being harrased by Mahesh Bhatt & family. Pls support.

A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) on Oct 23, 2020 at 2:26am PDT

మహేష్ భట్ లాయర్ ఈ వ్యాఖ్యలపై స్పందించడంతో పాటు లువైనా పై చట్ట పరమైన చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలియజేశాడు.   నిరాధార ఆరోపణలు చేసిన లువైనా పై చట్ట పరమైన చర్యలకు సిద్దము అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఉద్దేశ పూర్వకంగా లువైదా దర్శకుడు మహేష్ భట్ పై ఆరోపణలు చేసినట్లు సదరు లాయర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

మహేష్ భట్ పై లువైదా చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే  మహేష్ భట్ పై అనేక ఆరోపణలు రావడం జరిగింది. దర్శకుడు మహేష్ భట్ పెద్ద ఉమనైజర్ అని అనేక మంది ఆరోపించడం జరిగింది. ఇక సుశాంత్ సింగ్ ఆత్మ హత్య కేసులో మహేష్ భట్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. సుశాంత్ ఆత్మ హత్య వెనుక సుశాంత్ హస్తం ఉందని నమ్మిన ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనం వ్యక్తం చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishesh Films (@visheshfilms) on Oct 23, 2020 at 4:55am PDT