గద్దలకొండ గణేష్ చిత్రం ప్రస్తుతం మంచి వసూళ్లతో విజయం దిశగా పయనిస్తోంది. విడుదలకు కొన్ని గంటల ముందు టైటిల్ మార్చినా ఆ ప్రభావం కనిపించలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే పూజ హెగ్డే రోల్, కామెడీ, ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ గద్దలకొండ గణేష్ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. 

వరుణ్ తేజ్ నటనకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ గద్దలకొండ గణేష్ చిత్రంపై స్పందించాడు. సినిమా చూసిన తర్వాత ట్వీట్ చేశాడు. గద్దలకొండ గణేష్ చిత్రాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశా. గణేష్ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడు. 

హరీష్ శంకర్, 14 రీల్స్ ప్లస్ సంస్థ ఓ మంచి చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్ కు వరుణ్ తేజ్, హరీష్ శంకర్ ఇద్దరూ స్పందించారు. మా చిత్రం గురించి మీరు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ మహేష్ సర్ అని వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. 

తమిళంలో ఘనవిజయం సాధించిన జిగర్తాండని గద్దలకొండ గణేష్ గా రీమేక్ చేశారు. తమిళ నటుడు అథర్వ, మృణాళిని ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. 

 

భయపడుతూ చరణన్నకు ఫోన్ చేశా.. జూ.ఎన్టీఆర్ ఏం చేశారంటే: వరుణ్!

గద్దలకొండ గణేష్ తగ్గట్లేదుగా.. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్