దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకోబోతున్నాడు.  మెగా యువ హీరో వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన  గద్దల కొండా గణేష్ వారాంతరం కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. పోటీగా బందోబస్త్ కూడా భారీ స్థాయిలో రిలీజయినప్పటికీ వరుణ్ తేజ్ సినిమా ఏ మాత్రం తగ్గలేదు. 

ఈ మాస్ ఎంటర్టైనర్ సోమవారం కూడా 1.8కోట్ల వసూళ్లను అందుకొని బయ్యర్స్ లో ఆనందాన్ని నింపింది. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా ఎంతో దూరం లేదు. ఇదే తరహాలో వెళితే చిత్ర యూనిట్ బోనస్ కలెక్షన్స్ అందడం గ్యారెంటీ. మొత్తంగా గద్దలకొండ గణేష్ 17కోట్లకు పైగా షేర్స్ తో సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఈ వారంలో మరో అడుగు బలంగా వేస్తే చాలు. 

మరి వరుణ్ తేజ్ హరీష్ శంకర్ ల కాంబో ఎంతవరకు లాభాల్ని అందిస్తుందో చూడాలి. పూజా హగ్దే హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. ఈ వారం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో గద్దల కొండ గణేష్ కి కలిసొచ్చే అవకాశం ఉంది,   14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో గోపి అచంట - రామ్ అచంట ఈ సినిమాను నిర్మించారు.