Asianet News TeluguAsianet News Telugu

‘మహా సముద్రం’లో మహా ఎవరు...ఆమె పాత్ర ఏంటి?

తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తోనే తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శర్వానంద్, సిద్ధార్త్ హీరోలుగా ఆయన ‘మహాసముద్రం’ అనే సినిమాని రూపొందించారు. 

Mahas character in Maha Samudram
Author
Hyderabad, First Published Oct 11, 2021, 1:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 ‘మహా సముద్రం’పై టీమ్ అంతా  చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎంత న‌మ్మ‌కంగా అంటే స్టేజ్‌పై ఛాలెంజింగ్‌గా మాట్లాడేలాగ‌. ‘మహా సముద్రం’ లో క‌థే హీరో. ప్ర‌తి పాత్ర ఎమోష‌న‌ల్‌, లోతుగా క‌నిపిస్తుంద‌ని చెప్పిన శ‌ర్వానంద్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ‘‘రాసుకోండి ‘మహా సముద్రం’ తెలుగువారందరూ ఇది మా సినిమా అని గర్వంగా చెప్పుకుంటారు. ఇలాంటి సినిమాలో భాగ‌మైనందుకు చాలా గొప్ప‌గా ఫీల్ అవుతున్నాను. రావు ర‌మేశ్‌గారు ఈ క‌థ గురించి చెబుతూ ఎక్స్‌ట్రార్డిన‌రీ క‌థ అన్నారు. వెంట‌నే అజ‌య్ భూప‌తిగారిని పిలిపించి క‌థ విన్నాను. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశాను. నిర్మాత అనీల్ సుంక‌ర‌గారు కూడా సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు అని చెప్పుకొచ్చారు. దాంతో ఈ చిత్రంలో కథేంటి అనేది  పెద్ద సస్పెన్స్ గా అంతటా మారింది. 

అయితే ఈ సినిమాలో మహా అనే పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. అజ‌య్ భూప‌తి రాసుకున్న క‌థ‌, క్యారెక్ట‌ర్స్ అంత గొప్ప‌గా ఉంటాయి. 9 క్యారెక్ట‌ర్స్ చుట్టూ తిరిగే క‌థ ఇది. ఇంత మంచి సినిమాను ఇచ్చిన అజ‌య్ భూప‌తిగారికి థాంక్స్‌. ఈ సినిమా ఒక ల‌వ్‌స్టోరి. మ‌హా అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి పాత్ర‌ను అంద‌రూ చేయ‌లేరు. బ‌ల‌మైన ఎమోష‌న్స్ ఉండే పాత్ర‌. అదితి చాలా అద్భుతంగా న‌టించింది అంటూ మహా పాత్ర గురించి చెప్పుకొచ్చారు. మహా సముద్రం అంటే మహా అనే పాత్ర అని తేల్చేసారు. 

Also read చిరు మందు వేయాలంది ఎవరికీ... పవన్ కల్యాణే కేనా ఆ చురకలు!

తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తోనే తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శర్వానంద్, సిద్ధార్త్ హీరోలుగా ఆయన ‘మహాసముద్రం’ అనే సినిమాని రూపొందించారు. రొటీన్ సినిమాల్లా కాకుండా ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Also read నాగబాబు సంచలన నిర్ణయం.. `మా` సభ్యత్వానికి రాజీనామా..

ఇక ఈ సినిమాలో అదితిరావ్ హైదరీ- అను ఇమ్మాన్యుయేల్  హీరోయిన్స్ గా నటిస్తుండగా జగపతిబాబు, రావు రమేష్ లాంటి సీనియర్లు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రామేష్ గూని పాత్రలో నటించడం మరో విశేషం. అలాగే చుంచు మామ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబుగారు గుర్తుంటారు. యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఇప్పుటికే అన్ని పనులు  పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios