MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Nagarjuna, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? ఆ స్టార్‌ డైరెక్టర్‌ వల్లే

Nagarjuna, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? ఆ స్టార్‌ డైరెక్టర్‌ వల్లే

కింగ్‌ నాగార్జున, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ రావాల్సి ఉంది. కానీ ఆ స్టార్‌ డైరెక్టర్‌ వల్ల మిస్‌ అయ్యింది. మరి ఆ సినిమా ఏంటి? ఆ దర్శకుడు ఎవరనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 07 2026, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాగార్జున, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ
Image Credit : Asianet News

నాగార్జున, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ

నాగార్జున చాలా మంది దర్శకులతో పనిచేశారు. ఎంతో మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు ఇలా చాలా మందికి లైఫ్‌ ఇచ్చారు. అయితే కొంత మంది దర్శకులతో మాత్రం ఆయన పనిచేయలేదు. స్టార్‌ డైరెక్టర్లతోనూ వర్క్ చేయలేకపోయారు. అలా త్రివిక్రమ్‌తోనూ పనిచేయలేదు నాగ్‌. కాకపోతే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా మిస్‌ అయ్యింది. నిజానికి త్రివిక్రమ్‌ని పరిచయం చేయాల్సింది కూడా నాగార్జుననే. కానీ మరో స్టార్‌ డైరెక్టర్‌ వల్ల అది సెట్‌ కాలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రైటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన త్రివిక్రమ్‌
Image Credit : IMDB

రైటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన త్రివిక్రమ్‌

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. రైటర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. చాలా స్ట్రగుల్‌ అయిన ఆయన `స్వయంవరం` చిత్రంతో వెండితెరకు రైటర్‌గా పరిచయం అయ్యారు. ఓ రకంగా త్రివిక్రమ్‌కి దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ లైఫ్‌ ఇచ్చారని చెప్పొచ్చు. వరుసగా ఆయన సినిమాలకు పనిచేశారు మాటల మాంత్రికుడు. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్‌ కథలతోనే ఎక్కువగా సినిమాలు చేశారు విజయ్‌ భాస్కర్‌. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

Related Articles

Related image1
Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట
Related image2
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
35
`మన్మథుడు` కథతో డైరెక్టర్‌ కావాలనుకున్న త్రివిక్రమ్‌
Image Credit : Asianet News

`మన్మథుడు` కథతో డైరెక్టర్‌ కావాలనుకున్న త్రివిక్రమ్‌

ఈ క్రమంలో అప్పటి వరకు రైటర్‌గానే ఉన్న త్రివిక్రమ్‌ దర్శకుడిగా మారాలనుకున్నారు. ఆయన వద్ద రెండు కథలున్నాయి. దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ నెక్ట్స్ ఏం సినిమా చేయాలనుకున్నప్పుడు ఈ రెండు కథలు చెప్పారు. అయితే వీటిని తానే దర్శకుడిగా చేయాలనుకున్నారు త్రివిక్రమ్‌. నెమ్మదిగా తన మనసులో మాటని వ్యక్తం చేశారు. దర్శకుడిగా మారి సినిమా చేయాలనుకుంటున్న అని చెప్పడంతో విజయ భాస్కర్‌ కూడా ఓకే చెప్పారట.

45
నాగార్జునతో చేయాల్సిన మన్మథుడు త్రివిక్రమ్‌ కి మిస్‌
Image Credit : Asianet News

నాగార్జునతో చేయాల్సిన మన్మథుడు త్రివిక్రమ్‌ కి మిస్‌

అయితే మన్మథుడు కథని తాను చేయాలనుకున్నాడట త్రివిక్రమ్‌. దాన్ని నాగార్జునతో చేశారు. ఈ కథకి నాగార్జున సెట్‌ అవుతారని చెప్పి విజయ్‌ భాస్కర్‌ చెప్పడంతో ఆయన్ని కలిసి కథ వినిపించారు. నాగ్‌ కూడా వెంటనే ఓకే చెప్పారు. అయితే త్రివిక్రమ్‌ తన తొలి సినిమానే అంత పెద్ద హీరోని డీల్‌ చేయడం కష్టమని భావించారు. ఈ క్రమంలో మరో కథని తరుణ్‌తో చేయాలనుకున్నారు. ఆ సినిమాని త్రివిక్రమ్‌ చేయమని చెప్పాడట విజయ్‌ భాస్కర్‌. అలా తరుణ్‌తో త్రివిక్రమ్‌ సినిమా చేశారు. అలా నాగార్జునతో సినిమా మిస్‌ అయ్యింది. మళ్లీ వీరిద్దరు ఎప్పుడూ కలిసి పనిచేయలేదు.

55
నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్‌
Image Credit : our own

నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్‌

తరుణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే `నువ్వే నువ్వే`. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. దర్శకుడిగా త్రివిక్రమ్‌ని నిలబెట్టింది. ఇందులో తరుణ్‌కి జోడీగా శ్రియా నటించింది. ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్ర పోషించారు. 2002లో విడుదలై ఆకట్టుకుంది. ఈ మూవీ త్రివిక్రమ్‌కి లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత మూడేళ్లకి మహేష్‌ బాబుతో `అతడు` సినిమా చేశాడు త్రివిక్రమ్‌. `జల్సా`, `ఖలేజా`, `జులాయి`, `అత్తారింటికి దారేది`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అ ఆ`, `అజ్ఞాతవాసి`, `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో`, `గుంటూరు టాకీస్‌` వంటి చిత్రాలు చేశారు. స్టార్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్‌తో తొలిసారి వర్క్ చేస్తూ `ఆదర్శకుటుంబం` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image2
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Recommended image3
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
Gaddar Film Awards List: ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ నటుడు నాగచైతన్య.. రాజు వెడ్స్ రాంబాయికి అవార్డుల పంట
Recommended image2
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved