Asianet News TeluguAsianet News Telugu

చిరు మందు వేయాలంది ఎవరికీ... పవన్ కల్యాణే కేనా ఆ చురకలు!

పరోక్షంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కే చిరంజీవి చురక వేసినట్లు అనిపిస్తుంది. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ అన్నయ్య చిరంజీవిని కూడా టార్గెట్ చేశారు.

chiranjeevi interesting comments in pelli sandadi pre release event
Author
Hyderabad, First Published Oct 11, 2021, 1:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి సందడి ప్రీ రిలీజ్ వేడుక వేదికగా కొన్ని ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా ఒకరినొకరు దూషించుకుంటూ చిత్ర పరిశ్రమ పరువును ఒకింత పలుచన చేశారు. వ్యక్తిగత విమర్శలకు దిగి, వివాదం రాజేశారు. మాటల్లో మాటగా ఉదహరిస్తూ వాళ్లకు చిరంజీవి చురకలు వేశారు. 


పెళ్లి సందడి ప్రీ రిలీజ్ వేడుకకు మరో అతిధిగా వచ్చిన వెంకటేష్ గురించి చిరంజీవి మాట్లాడారు. ఆయన సినిమాలంటే నాకు ఇష్టమని, నారప్ప సినిమాలో వెంకటేష్ నటన అద్భుతం అన్నారు. అలాగే సైరా మూవీ చూసి, వెంకీ తనకు ఫోన్ చేసి, చాలా బాగా చేశారని అభినందించారు అన్నారు. హీరోల మధ్య ఇంత ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే వివాదాలు ఉండవు అన్నారు. 


తాత్కాలిమైన కొన్ని పదవుల కోసం దిగజారి మాట్లాడాలా.. పదవుల కోసం ఇతరులకు లోకువ కావాలా అని ప్రశ్నించారు. పదవులు రెండేళ్లు ఉంటాయి. లేదంటే మూడేళ్లు ఉంటాయి.. వాటి కోసం ఒకరిని ఇంకొకరు తిట్టుకోవాలా అని.. చిరంజీవి సూటిగా ప్రశ్నించారు. ఒకరిని అనడం, అనిపించుకోవడం ఎందుకు అవసరమా అన్నాడు.  అవన్నీ తాత్కాలికం  వివాదం ఒకరు మొదలుపెట్టారని, ఆ వివాదం మొదలుపెట్టిన వారిని గుర్తించి మందు వేయాలని అన్నారు. 


పరోక్షంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కే చిరంజీవి చురక వేసినట్లు అనిపిస్తుంది. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ అన్నయ్య చిరంజీవిని కూడా టార్గెట్ చేశారు. ఆయన సప్పోర్ట్ లేకుండా పరిశ్రమలో ఎదిగానని చెప్పిన పవన్, అన్నయ్య చిరంజీవి సీఎం జగన్ ని బ్రతిమిలాడు కుంటున్నారు అన్నారు. 


శ్రీకాంత్ కొడుకు రోషన్ గురించి సైతం చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోషన్ చిరంజీవి గారు అంటూ నన్ను పేరు పెట్టి పిలిచాడు.. ఇదేనా మీ పెంపకం అంటూ.. వేదికపై ఉన్న ఊహా, శ్రీకాంత్ లను అడిగారు. ఎప్పుడూ పెదనాన్న అని పిలిచే రోషన్ అలా పిలవడం నచ్చలేదు అన్నాడు. వేదిక కబాడంతో అలా పిలిచానని రోషన్ వివరణ ఇవ్వగా... శ్రీకాంత్ నా తమ్ముడు.. తన కొడుకు నువ్వు బిడ్డతో సమానం.. నువ్వు పెదనాన్న అని పిలవాలి అన్నారు. 


ఇక చిరంజీవి స్పీచ్ లో అధికభాగం రాఘవేంద్ర రావును పొగడడంతోనే సాగింది. ఆయన రొమాంటిక్ డైరెక్టర్ అన్న చిరంజీవి.. పెళ్ళైన కొత్తలో ట్రైన్ లో సురేఖ, నాకు శోభనం ఏర్పాటు చేశారు అన్నారు. తన ఎదుగుదలలో రాఘవేంద్ర రావు పాత్ర ఎంతో ఉందని.. ఆయన ఓ చిలిపి డైరెక్టర్ అన్నారు. సుదీర్ఘం సాగిన చిరంజీవి ప్రసంగంలో అనేక విషయాలు ఆయన ప్రస్తావించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios