మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కొడుకు ఎంకె ముత్తు అనారోగ్యంతో కన్నుమూశారు.
KNOW
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, పద్మావతి దంపతుల పెద్ద కొడుకు ఎంకె ముత్తు కన్నుమూశారు. తమిళంలో ఆయన పూక్కారి, పిల్లయ్యో పిల్లై లాంటి సినిమాల్లో నటించారు. నటనతో పాటు పాటలు పాడటంలో కూడా ఆసక్తి ఉండేది. మత్తు నటించిన సినిమాలన్నీ పరాజయం పాలవ్వడంతో సినిమా రంగానికి చాలా కాలంగా దూరంగా ఉన్నారు.
తండ్రి కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన అభిప్రాయాలతో విభేదించేవారని, అందుకే కరుణానిధికి ఆయన దూరంగా ఉండేవారని చెప్తారు. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కొన్ని సినిమాల్లో ఆయన నటించారు కాని.. కరుణ రాజకీయాలకు వారసుడిగా రావాలన్న ఆలోచన ఎంకె ముత్తుకు ఉండేది కాదు. అందుకే ఆయన ఎలాంటి రాజకీయా కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
77 ఏళ్ల ఎంకె ముత్తు గత 4 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయసుపెరగడంతో పాటు వచ్చిన వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యం ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఇక పరిస్థితి విషమించడంతో ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు. ఇక ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు(19 జులై) ఉదయం 8 గంటలకు ఎంకే ముత్తు కన్నుమూశారని ఆయన భార్య తెలిపారు. ఎంకె ముత్తు పార్థివ దేహాన్ని ఆయన స్వగృహంలో బంధువులు, ప్రజల సందర్శనార్థం ఉంచారు.
ఎంకె ముత్తు అంత్యక్రియల్లో ఆయన సోదరుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పాల్గొనబోతున్నారు. ఈ సమాచారం అందడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కరుణానిధి కుటంబం నుంచి ముత్తు తో పాటు మరికొందరు ఇండస్ట్రీలో కొనసాగారు. ప్రస్తుత ముఖ్యమంత్రి తనయుడు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా హీరోగా కొన్ని సినిమాలు చేశారు. నిర్మాతగా కూడా ఆయన కోలీవుడ్ లో కొనసాగారు. ఫుల్ టైమ్ రాజీకాయల్లోకి వచ్చిన తరువాత ఆయన సినిమాలు మానేశారు.
