ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో హాస్పిటల్ లో చేరిన స్టార్ కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూశారు.

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు ముంచెతుతున్నాయి. సీనియర్ నటుడు కోట మరణించి వారంరోజులు కూడా గడవకముందే మరో సీనియర్ నటుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కమెడియన్ గా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ఫిష్ వెంకటే అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో విలన్ గా, కామెడీ విలన్ గా, కమెడియన్ గా నటించి నవ్వులు పూయించిన ఫిష్ వెంకట్, గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం క్షీనించడంతో సినిమాలు చేయలేక మానేశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు ఫిష్ వెంకట్. వ్యాధి ముదిరి రెండు కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ కాలం గడుపుతున్నారు వెంకట్.

ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత ఈ మధ్య కోలుకున్నారు వెంకట్. అయితే రీసెంట్ గా పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిష్‌ వెంకట్‌ చికిత్స కోసం ఎంతో మంది దాతలు విరాళాలు అందించారు. చిన్నా పెద్ద స్థార్స్ కొంత మంది స్పందించి ఫిష్ వెంటక్ ఆపరేషన్ కు కావల్సిన డబ్బును సమకూర్చుతున్న క్రమంలోనే వెంకట్ ఆరోగ్యం మరింతగా విషమించింది. త కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కన్నుమూశారు ఫిష్ వెంకట్. ఈ విషయం తెలిసిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

ప్రస్తుతం ఫిష్ వెంకట్ వయసు 54 ఏళ్లు. ఎంతో కెరీర్ ఉన్న ఈ నటుడు అనారోగ్యం దెబ్బకు తుదిశ్వాస విడిచారు. తెలంగాణ యాసలో విలనిజాన్ని, కామెడీని పండిచిన వెంకట్ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఫిష్‌ వెంకట్‌ అసలు పేరు మంగళంపల్లి వెంకటేశ్‌. అయితే.. ముషీరాబాద్ చేపల మార్కెట్‌లో వ్యాపారం చేసిన ఆయన ఫిష్ వెంకట్‌గా గుర్తింపు పొందారు. దర్శకుడు వీవీ వినాయక్‌ ఆయనను వెండితెరకు పరిచయం చేశారు. ఆది సినిమాలో తొడగొట్టు చిన్నా అంటూ వెంకట్ చెప్పిన డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది.