- Home
- Entertainment
- 100 కు పైగా సినిమాలు చేసినా పేదరికంలోనే ఫిష్ వెంకట్, ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో మరణం
100 కు పైగా సినిమాలు చేసినా పేదరికంలోనే ఫిష్ వెంకట్, ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో మరణం
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూశారు. 100కు పైగా సినిమాల్లో నటించి నవ్వించిన హాస్యనటుడు, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని దీన స్థితిలో కన్నుమూశాడు. ఫిష్ వెంకట్ కు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. ?
- FB
- TW
- Linkdin
Follow Us

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం.. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడం చాలా కష్టం. వందల సినిమాలు చేసి, స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నవారు కూడా ఆతరువాతి కాలంలో దీన స్థితిలో మరణించిన సందర్భాలు ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. అలాంటి కోవలోకే ఫిష్ వెంకట్ కూడా వస్తారు. ఆయన దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, కామెడీ విలన్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ ను చేసి మెప్పించాడు. అన్ని సినిమాలు చేసినా కూడా ఆయనకు పేదరికం తప్పలేదు.
తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి నవ్వులు పూయించిన ఫిష్ వెంకట్ జీవితంలో మాత్రం చాలా విషాదాలు ఉన్నాయి. ఆయన 100 సినిమాలకుపైగా చేసినా కానీ ఆర్ధికంగా నిలబడలేకపోయాడు. ముషీరాబాద్ ప్రాంతంలో చేపల వ్యాపారం చేయడం వల్ల అతనికి ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చింది.
అయితే దివంగత నటుడు శ్రీహరి ప్రోత్సాహంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఫిష్ వెంకట్.. కొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా, కొన్ని సినిమాల్లో ఫుల్ లెన్త్ రోస్ కూడా చేశాడు. కొన్ని సినిమాల్లో మాత్రం ఆయన పాత్ర పరిధి చాలా తక్కువ అవ్వడంతో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ వచ్చేది కాదు. దానికితోడు వెంకట్ అలవాట్లు కూడా అతని ఆరోగ్యాన్ని పాడుచేసినట్టు తెలుస్తోంది.
ఇక ఫిష్ వెంకట్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. తన కొడుకుని కూడా సినిమాల్లోకి తీసుకురావాలి అని వెంకట్ ఆశపడ్డారు. దాదాపు 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా...ఒక చిన్న ఇల్లు తప్పించి ఫిష్ వెంకట్ ఆస్తులేమి కూడబెట్టలేదని తెలుస్తోంది. అంతే కాదు వెంకట్ మంచి ఫామ్ లో ఉన్నప్పడు వెంట తిరిగి పాడు చేసిన కొంత మంది, ఆయన అనారోగ్యం గురించి తెలిసి ముఖం చాటేశారని వెంకట్ ఫ్యామిలీ ఓ సందర్భంలో వెల్లడించారు. కిడ్నీ సంబంధిచిన వ్యాధితో బాధపడిన వెంకట్ కు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందిపడ్డాడు.
తన పరిస్థితి గురించి పలు యూట్యూబ్ ఛానెన్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన వెల్లడించారు. రెండు కిడ్నీలు పాడవడంతో ఇండస్ట్రీ పెద్దలను సాయం కోరుతు ఎన్నోసార్లు వేడుకున్నాడు వెంకట్. అయితే టాలీవుడ్ నుంచి కొంత మంది మాత్రం ఫిష్ వెంకట్ కు సాయం చేశారు. కాని ఆయన కిడ్నీ ఆపరేషన్ కు సరిపడా డబ్బులు లేకపోడం తో చాలామందిని సాయం అడిగారు. అప్పటికీ ఆలస్యం అవ్వడంతో వెంకట్ మరణించారు.
గతంలో ట్రీట్మెంట్ తీసుకున్న తరువాత ఈ మధ్య కోలుకున్నారు వెంకట్. అయితే రీసెంట్ గా పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతూ మరణించారు. ఫిష్ వెంకట్ చికిత్స కోసం ఎంతో మంది దాతలు విరాళాలు అందించారు. చిన్నా పెద్ద స్థార్స్ కొంత మంది స్పందించి ఫిష్ వెంకట్ ఆపరేషన్ కు కావల్సిన డబ్బును సమకూర్చుతున్న క్రమంలోనే వెంకట్ ఆరోగ్యం మరింతగా విషమించింది. త కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కన్నుమూశారు ఫిష్ వెంకట్.