Mahesh babu: కథా లేదు, జోనర్ తెలియదు.. విలన్ పేరు సోమలింగం
అసలు అడుగు కూడా పడక ముందే ఆకాశంలో విహరించే వారిని, గాల్లో మేడలు కట్టేవారిని ఉద్దేశించి తెలుగులో చక్కని సామెత చెప్పారు. ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అనేది ఆ సామెత. మహేష్ -రాజమౌళి సినిమా పై వస్తున్న గాసిప్స్, పుకార్లు.. ఈ సామెతను తలపిస్తున్నాయి.
స్టార్ దర్శకుడిగా ఎవరెస్ట్ కి చేరిన రాజమౌళి (Rajamouli) తీరు వేరు. ఆయన నచ్చిన హీరోలతోనే వరుసగా సినిమాలు చేస్తారు. ప్రతి స్టార్ హీరోని కవర్ చేయాలని అనుకోరు. దాని వలన రాజమౌళి ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలతో రిపీటెడ్ గా చిత్రాలు చేశారు. అవకాశం కుదిరినా మహేష్, పవన్, అల్లు అర్జున్ వంటి మిగతా స్టార్స్ జోలికి పోలేదు. ఈ విషయంలో ఆయన కారణాలు ఆయనకున్నాయి.
అయితే సదరు స్టార్ హీరోలతో రాజమౌళి సినిమా చేయాలని, ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నారు. ఎట్టకేలకు మహేష్ (Mahesh babu) తో రాజమౌళి కన్ఫర్మ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన చిత్రం మహేష్ తో ఉంటుందని వెల్లడించారు. అదే సమయంలో మహేష్ తో చాలా కాలం క్రితమే మూవీ చేయాల్సిందని, ఇద్దరం బిజీ కావడం వలన కుదరలేదన్నారు.
ఈ ప్రకటన మహేష్ ఫ్యాన్స్ లో ఆనందం కట్టలు తెంచుకునేలా చేసింది. ఇక రాజమౌళి ప్రకటన అనంతరం ఈ ప్రాజెక్ట్ పై అనేక ఊహాగానాలు, పుకార్లు చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి.జోనర్, కథ, స్టార్ క్యాస్ట్ ఇలా పలు కథనాలు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది. ఈ మూవీలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్నారట. ఆయనతో టీమ్ సంప్రదింపులు కూడా జరిపారట.
Also read ఊహించని చిత్ర విచిత్రం అంటూ RRR పోస్ట్.. అల్లూరి, కొమరం భీం కలసి 4 ఏళ్ళు పూర్తి
నిజానికి మహేష్ తో చేసే మూవీ కథ కూడా ఫైనల్ కాలేదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కొన్ని స్టోరీ లైన్స్ పై డిస్కషన్స్ నడిచాయి. అయితే ఆయన చెప్పిన వాటిలో ఏ స్టోరీ లైన్ తీసుకోవాలో ఫైనల్ కూడా చేయలేదు. లాక్ డౌన్ ముగిశాక రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. కాబట్టి స్టోరీపైనే స్పష్టత లేనప్పుడు, విలన్ గా విక్రమ్ ని అనుకుంటున్నారు అనడంలో అసలు ఎలాంటి లాజిక్ లేదు. ఎందుకంటే కథలో పాత్రల అనుగుణంగానే క్యాస్ట్ ఎంపిక జరుగుతుంది. ఈ విషయంలో రాజమౌళి చాలా పర్ఫెక్ట్/ కాబట్టి దీన్ని పుకారుగా కొట్టేయవచ్చు.
Also read NTR: వెకేషన్ కి వేళాయెరా.. ఫ్యామిలీ తో విదేశాలకు చెక్కేస్తున్న ఎన్టీఆర్!