NTR: వెకేషన్ కి వేళాయెరా.. ఫ్యామిలీ తో విదేశాలకు చెక్కేస్తున్న ఎన్టీఆర్!
జూనియర్ ఎన్టీఆర్ వెకేషన్ మూడ్ లో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో విదేశాలకు చెక్కేస్తున్నారు. తీరిక లేని బిజీ షెడ్యూల్స్ నుండి కొంచెం విరామం తీసుకున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR movie) షూటింగ్ పూర్తి కావడంతో ఎన్టీఆర్ తన లుక్ మార్చేశారు. పెరిగిన జుట్టు, మీసం తగ్గించారు. కొమరం భీమ్ రోల్ కోసం రఫ్ లుక్ లోకి మారిన ఎన్టీఆర్, స్లిమ్ గా రెడీ అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా... కొంచెం విరామం తీసుకున్నారు. తెలుగుతో పాటు దేశంలోని ప్రధాన భాషల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం.
ఆర్ ఆర్ ఆర్ కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టి పనిచేశారు. కఠినమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడం జరిగింది. షూటింగ్ మొదలైన నెలల వ్యవధిలో ఎన్టీఆర్ (NTR) చేతికి గాయం కావడం జరిగింది. డూప్ లేకుండా దాదాపు అన్ని సన్నివేశాలలో కష్టపడి నటించారు. మరి మూడేళ్లకు పైగా సాగిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో ఎన్టీఆర్ చాలా అలసిపోయారు. దీనితో ఆయన ఫ్యామిలీ తో వెకేషన్ ప్లాన్ చేశారు.
భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో పాటు ఆయన విదేశీ విహారానికి వెళుతున్నారు.కుటుంబంతో ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. ఎన్టీఆర్ స్విట్జర్లాండ్ వెళుతున్నట్లు సమాచారం అందుతుంది. దాదాపు వారం రోజులకు పైగా అక్కడే గడపనున్నారట. ఇక ఎన్టీఆర్ చాలా అరుదుగా వెకేషన్స్ కి వెళతారు. ఆయన ఖాళీ సమయాన్ని ఇంట్లో భార్య పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు. కుటుంబాన్ని మీడియాకు, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఎన్టీఆర్ భార్య సైతం మీడియాలో ఫోకస్ కావాడానికి అసలు ఇష్టపడరు.
ఇక వెకేషన్ అనంతరం ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. వచ్చే ఏడాది ఆయన దర్శకుడు కొరటాల శివ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీగా తెరకెక్కుతున్నట్లు దర్శకుడు కొరటాల ధృవీకరించారు. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also read బాలయ్య 'అన్ స్టాపబుల్'లో రోజా.. అసలు సిసలైన మజా, ఆ టాపిక్ మాట్లాడుకుంటారా