Asianet News TeluguAsianet News Telugu

ఊహించని చిత్ర విచిత్రం అంటూ RRR పోస్ట్.. అల్లూరి, కొమరం భీం కలసి 4 ఏళ్ళు పూర్తి

స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలతో రాజమౌళి కల్పితగాధగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాంచరణ్, ఎన్టీఆర్ ఆ మహా వీరుల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అంకురార్పణ జరిగి నేటికి నాలుగేళ్లు పూర్తయింది అంటే నమ్మగలరా

RRR Movie team interesting post on Rajamouli, ntr, ram charan pic
Author
Hyderabad, First Published Nov 18, 2021, 3:23 PM IST

జక్కన్నతో సినిమా అంటే మామూలుగా ఉండదు మరి. రాజమౌళి తెరకెక్కించే చిత్రాలు ఏళ్ల తరబడి సెట్స్ పై ఉంటాయి. రాజమౌళి దర్శకత్వంలో నటించాలంటే నటీనటులకు చాలా ఓపిక అవసరం. బాహుబలి తర్వాత రాజమౌళి మరో విజువల్ వండర్ ని వెండితెరపై చూపించబోతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. 

స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలతో రాజమౌళి కల్పితగాధగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాంచరణ్, ఎన్టీఆర్ ఆ మహా వీరుల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అంకురార్పణ జరిగి నేటికి నాలుగేళ్లు పూర్తయింది అంటే నమ్మగలరా.. నిజం.. ఈ చిత్రం కోసం రాజమౌళి, రాంచరణ్, రామారావు చేతులు కలపి నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 

'ఈ పిక్ పోస్ట్ చేసి నాలుగేళ్లు పూర్తవుతోంది. చిత్రీకరణ మొదలై మూడేళ్లు పూర్తయింది. మరో 50 రోజుల్లో మీరు వెండి తెరపై మ్యాజిక్ ని ఆస్వాదిస్తారు. ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం' అంటూ ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో నాలుగేళ్ళ క్రితం రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ లతో సోఫాలో జాలిగా కూర్చుని ఉన్న పిక్ తో కూడిన ట్వీట్ ని కోట్ చేశారు. 

Also Read: పరువాలని బోల్డ్ గా చూపిస్తూ.. మాళవిక అందాల విధ్వంసం, హాట్ నెస్ కి నో లిమిట్స్

రాజమౌళి ఆ పిక్ పోస్ట్ చేసిన తర్వాతే వీరి ముగ్గురి కాంబోలో మూవీ రాబోతుందనే వార్తలు మొదలయ్యాయి. ఈ పిక్ గురించి ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో రాంచరణ్ వివరించాడు. తాను ఎయిర్ పోర్ట్ కి వెళుతుండగా రాజమౌళి గారు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారని.. అక్కడికి వెళ్లి చేస్తే తారక్ ఆల్రెడీ అక్కడే ఉన్నట్లు రాంచరణ్ తెలిపాడు. అప్పుడే తొలిసారి రాజమౌళి మా ఇద్దరికీ ఆర్ఆర్ఆర్ చిత్ర కథ గురించి చెప్పారని చరణ్ ప్రెస్ మీట్ లో తెలిపారు. అప్పుడే రాజమౌళి ఈ పిక్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

ఆర్ఆర్ఆర్ చిత్రం బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కింది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios