RRR:ఈ ప్రశ్న అడగ్గానే ...రాజమౌళికి విసుగు,ప్రస్టేషన్ వచ్చాయి
రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరి స్టార్లుని ఎలా బ్యాలన్స్ చేశారనే ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెబుతూ.. నాకు స్టార్ వాల్యు బాగా తెలుసు. స్టార్ వాల్యుతోనే ఈ స్థాయిలోకి వచ్చాను. అయితే స్టార్స్ ఆడియన్స్ ని థియేటర్ లోకి మాత్రమే తీసుకురాగలరు.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. వరసపెట్టి బెంగుళూరు, హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక సినిమా విశేషాలని మీడియాతో రాజమౌళి పంచుకున్నారు. అయితే కొందరు మీడియావాళ్లు అడిగిన ప్రశ్నలు ఆయనకు కొద్దిగా ప్రష్టేషన్,చిరాకు తెప్పించాయనేది నిజం. అందులో ఒకటి ఆర్ ఆర్ ఆర్ కథ గురించి. ఇప్పటికే ట్రైలర్ ద్వారా స్టోరీ లైన్ చెప్పే ప్రయత్నం చేసారు. అయినా సరే ఇంకా కథ గురించి అడగటంతో ఆయనలో ఓ విధమైన ప్రస్టేషన్ కనిపించింది. అలాగే కొందరు మీడియావారు...జూ.ఎన్టీఆర్ ఎందుకు ముస్లిం క్యాప్ ధరించాడు..అతను ముస్లిమా, చరణ్ అల్లూరి అయితే నాట్టు డాన్స్ ఎందుకు చేసారు?’ ఇలా సాగాయి ప్రశ్నలు.
రాజమౌళి స్పందిస్తూ...“ఈ ప్రపంచంలో ఎవరైనా ట్రైలర్ ద్వారా మొత్తం కథ చెప్పేస్తారా ? ఎవరైనా నేను ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ద్వారా కథ రివీల్ చేసినట్లు చేసారా ? నేను ఇలా మొత్తం కథ చెప్పినా ఇంకా నన్ను కథ ప్రశ్నలు అడుగుతున్నారు...స్క్రిప్టు మొత్తం పంపమంటారా” అన్నారు. ఆ తర్వాత ఈ సినిమా కథ దేశభక్తి చుట్టూ కాదని, స్నేహం చుట్టూ సాగుతుందని అన్నారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరి స్టార్లుని ఎలా బ్యాలన్స్ చేశారనే ప్రశ్నకు రాజమౌళి సమాధానం చెబుతూ.. నాకు స్టార్ వాల్యు బాగా తెలుసు. స్టార్ వాల్యుతోనే ఈ స్థాయిలోకి వచ్చాను. అయితే స్టార్స్ ఆడియన్స్ ని థియేటర్ లోకి మాత్రమే తీసుకురాగలరు. రామ్ చరణ్, తారక్ .. ప్రేక్షకులని థియేటర్ వరకూ తీసుకురాగలరు. సినిమా మొదలైన తర్వాత తెరపై వారిద్దరూ రెండు పాత్రలు. ఆ పాత్రలు పండితేనే సినిమా విజయం సాధిస్తుంది. ప్రేక్షకుడి పాత్రనే కనెక్ట్ అవుతాడు తప్పితే స్టార్ తో కాదుని నేను నమ్ముతాను.ఈ సినిమాలో అల్లూరి, కొమరం భీమ్ పాత్రలు కనిపిస్తాయి తప్పితే చరణ్ ఎన్టీఆర్ కాదనిని చెప్పుకొచ్చారు.
Also read RRR: గట్టిగా గిల్లిన ఎన్టీఆర్..పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంకా మారలేదు.. చరణ్, తారక్ గొడవతో రాజమౌళికి తలనొప్పి
సినిమా ప్రకటన రోజునే ఆర్ ఆర్ ఆర్ కథ గురించి హింట్ ఇచ్చి వదిలిన రాజమౌళి ఇప్పుడు ట్రైలర్ ద్వారా కథ చెప్పే ప్రయత్నం చేసాడు. ముందుగా బ్రిటిష్ వారు ఒక గోండు పిల్లను తీసుకెళ్లడం, వారికి సంరక్షకుడిగా ఉన్న ఎన్టీఆర్ పాత్ర ప్రవేశం, తనను ఎదుర్కోవడానికి పోలీస్ అయిన రామ్ చరణ్ ను ఎన్టీఆర్ ను ఢీకొట్టేందుకు పెట్టడం జరుగుతుంది. అలాగే రామ్ చరణ్ పాత్ర, తను పోలీస్ అన్న విషయాన్ని దాచిపెట్టి ఎన్టీఆర్ తో స్నేహం చేయడం, తర్వాత బ్రిటిష్ వారి అరాచకాలను గుర్తించి ఇద్దరూ కలిసి ఎదుర్కోవడం, ఆ పోరాటంలో వారు అమరులవ్వడం జరుగుతుందని ట్రైలర్ చెబుతోంది.
Also read RRR Movie: నాపై చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు.. వైరల్ అవుతున్న అలియా భట్ కామెంట్స్