RRR Movie: నాపై చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు.. వైరల్ అవుతున్న అలియా భట్ కామెంట్స్
యంగ్ టైగర్ NTR , మెగా పవర్ స్టార్ Ram Charan నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం దేశం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేరాయి. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, గుండెల్లి పిండేసే ఎమోషనల్ సన్నివేశాలతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.
యంగ్ టైగర్ NTR , మెగా పవర్ స్టార్ Ram Charan నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం దేశం మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేరాయి. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, గుండెల్లి పిండేసే ఎమోషనల్ సన్నివేశాలతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు ట్రైలర్ తో అర్థం అవుతోంది.ట్రైలర్ లో ప్రతి అంశం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.
ట్రైలర్ విడుదలయ్యాక జక్కన్న అండ్ టీం మొత్తం ఇండియాని చుట్టేస్తున్నారు. ముంబై, చెన్నై, బెంగుళూరులో మీడియా సమావేశాలు ముగిసాయి. నేడు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా సమావేశంలో రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ అనేక విషయాలు పంచుకున్నారు. కానీ అలియా భట్ చెప్పిన విశేషాలు బాగా వైరల్ అవుతున్నాయి. తెలుగులో ముద్దు ముద్దుగా రెండు లైన్స్ కూడా చెప్పింది.
ట్రైలర్ పగిలిపోయింది.. ముంబైలో మాకు పిచ్చెక్కింది అంటూ అలియా క్యూట్ గా ప్రెస్ మీట్ లో మాట్లాడడం స్టార్ట్ చేసింది. రాంచరణ్, ఎన్టీఆర్ గురించి సెట్స్ లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ని అలియా పంచుకుంది. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరిపై అలియా జోకులు పేల్చింది. అలియా భట్ ఈ చిత్రంలో రాంచరణ్ కు పెయిర్ గా నటిస్తోంది. కానీ సెట్స్ మాత్రం మొదట కలిసింది ఎన్టీఆర్ ని అని చెప్పింది. సెట్స్ కి వెళ్ళగానే ఎన్టీఆర్ మాటలకు షాక్ అయ్యిందట.
నేను హీరోయిన్ తో వర్క్ చేసి చాలా రోజులు అవుతోంది. ఆర్ఆర్ఆర్ స్టార్ట్ అయ్యాక రాంచరణ్ తో వర్క్ చేస్తున్నాను. కాబట్టి కొంచెం అడ్జెస్ట్ చేసుకో అని చెప్పాడట. ఇక రాంచరణ్ కూడా సెట్స్ కి వచ్చాక ఇద్దరు ఒకరిని ఒకరు లాక్కోవడం, జోకులు వేసుకోవడం చేస్తున్నారు. నేనక్కడ ఉన్నాననే సంగతి కూడా పట్టించుకోలేదు. అసలు వాళ్ళిద్దరికీ నేనక్కడ ఉండడం ఇష్టం లేదేమో.. నన్ను పట్టించుకోలేదు అంటూ అలియా నవ్వులు పూయించింది.
అలియా గురించి రాంచరణ్ మాట్లాడుతూ.. అలియా ని ఫస్ట్ డే కలిసినప్పుడు నేను రామరాజు గెటప్ లో ఉన్నా. ఆరోజు నాకు పెద్ద సన్నివేశం ఉంది. సో నేను అలియాతో ఆరోజు ఎక్కువగా మాట్లాడలేదు. కానీ ఆమె అద్భుతమైన నటి అని రాంచరణ్ కితాబిచ్చారు. ఇక అలియా గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తొలిసారి ఆమెని కలసినప్పుడు కొంచెం నెర్వస్ గా ఫీల్ అయినట్లు ఎన్టీఆర్ తెలిపారు. కానీ నెమ్మదిగా బాగా మాట్లాడుకున్నామని ఎన్టీఆర్ అన్నాడు.
అలియా భట్ ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా సీతా పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియా భట్ రోల్ ఈ చిత్రంలో ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో ఆమె హావభావాలు చక్కగా కుదిరాయి. Also Read: RRR: tv9 పై రాజమౌళి అదిరిపోయే పంచ్, అంతటా వైరల్