Asianet News TeluguAsianet News Telugu

అసలే చలికాలం, బికినీలో మంచు లక్ష్మి సాహసాలు చూశారా.. వైరల్ వీడియో

తాజాగా మంచు లక్ష్మి ఎవరూ ఊహించని సాహసం చేసింది. ఏకంగా బికినిలో కనిపిస్తూ ఐస్ బాత్ ఛాలెంజ్ లో పాల్గొనింది. 

Lakshmi Manchu ice bath video in bikini goes viral dtr
Author
First Published Dec 17, 2023, 3:41 PM IST

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో కొంతకాలం నటిగా రాణించింది మంచు లక్ష్మి. యాంకర్ గా కూడా సత్తా చాటింది. కానీ ఆ తర్వాత మంచు లక్ష్మికి ఆఫర్స్ కరువయ్యాయి. మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది. 

అయితే మంచు లక్ష్మికి ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ లేవు. దీనితో మంచు లక్ష్మి అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఏకంగా ఈ బోల్డ్ బ్యూటీ మకాం ముంబైకి మార్చేసినట్లు తెలుస్తోంది.  

మంచు లక్ష్మి నాలుగు పదుల వయసులో కూడా సెగలు పుట్టించే గ్లామర్ తో యువతని ఆకర్షిస్తూ ఉంటుంది. తరచుగా మంచు లక్ష్మి కలర్ ఫుల్ అవుట్ ఫిట్స్ లో రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా తాజాగా మంచు లక్ష్మి ఎవరూ ఊహించని సాహసం చేసింది. 

ఏకంగా బికినిలో కనిపిస్తూ ఐస్ బాత్ ఛాలెంజ్ లో పాల్గొనింది. ఫిన్లాండ్ వెకేషన్ లో భాగంగా మంచు లక్ష్మి ఐస్ వాటర్ లో బికినిలో మునుగుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు మంచు లక్ష్మి ఐస్ బాత్ పై ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.. మంచు లక్ష్మి మంచు వాటర్ లో మునుగుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. 

గడ్డ కట్టే చలిలో మంచు లక్ష్మి ఐస్ బాత్ ఛాలెంజ్ తీసుకుంది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, నేహా శర్మ ఇలా చాలా మంది హీరోయిన్లు ఐస్ బాత్ ఛాలెంజ్ ని స్వీకరించడం చూశాం. మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. మంచు లక్ష్మికి ముంబైలో ఇల్లు అవసరం అయినప్పుడు రకుల్ సాయం చేసినట్లు కూడా ఆమె గతంలో తెలిపింది. ఏది ఏమైనా 46 ఏళ్ల వయసులో ఐస్ బాత్ ఛాలెంజ్ తీసుకోవడం గొప్ప విషయమే అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios