Kiara Advani: నటి కియారా అద్వానీ `డాన్ 3` సినిమా నుంచి తప్పుకుంది. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. మరి కియారా ఎందుకు తప్పుకుందనేది చూస్తే. 

Kiara Advni: నటి కియారా అద్వానీ డాన్ 3 సినిమా నుంచి తప్పుకుంది. గత సంవత్సరం ఫర్హాన్ అఖ్తర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చెప్పింది. కానీ ఈ సంవత్సరం మొదట్లో తను గర్భవతి అని చెప్పడంతో కియారా ఈ నిర్ణయం తీసుకుంది. కియారా సన్నిహితుల ప్రకారం, ఆమె నటన నుంచి విరామం తీసుకుని గర్భధారణ సమయాన్ని, బిడ్డ పుట్టిన తర్వాత దాని ఆలనాపాలనను ఆనందించాలనుకుంటోంది. 

కియారా ప్రస్తుతం 'టాక్సిక్', 'వార్ 2' షూటింగ్‌లతో బిజీగా ఉంది. `డాన్ 3` నిర్మాతలు ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. అందుకే వాళ్లు ఇప్పుడు కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని ఇండియా టుడే డిజిటల్ రిపోర్ట్ చేసింది.

ఇటీవల డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో 'డాన్ 3' షూటింగ్ ఈ సంవత్సరం మొదలవుతుందని కన్ఫర్మ్ చేశాడు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ మెయిన్ రోల్‌లో కనిపిస్తే, విక్రాంత్ మస్సీ విలన్‌గా నటిస్తాడు. షారుఖ్ ఖాన్ తప్పుకున్న తర్వాత రణ్‌వీర్ సింగ్ డాన్ పాత్రను తీసుకున్నాడు. 

కియారా అద్వానీ చివరిగా రామ్ చరణ్, శంకర్ కలిసి చేసిన `గేమ్ ఛేంజర్` సినిమాలో కనిపించింది. ఇది కియారా మూడో సౌత్ ఇండియన్ సినిమా. కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. బాక్సాఫీసు వద్ద పూర్తిగా నిరాశ పరిచింది.

 ఫిబ్రవరి మొదట్లో కియారా అద్వానీ, ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా తాము బిడ్డను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చెప్పారు. కియారా, సిద్ధార్థ్ 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. 

కియారా ప్రస్తుతం యష్‌తో కలిసి `టాక్సిక్` సినిమా షూటింగ్‌లో ఉంది. హృతిక్ రోషన్‌తో కలిసి `వార్ 2` సినిమాలో నటిస్తోంది. రణ్‌వీర్ సింగ్‌తో డాన్ 3లో నటించడం లేదు. ఇదిలా ఉంటే, సిద్ధార్థ్ గత సంవత్సరం తన ప్రాజెక్ట్ `VVAN: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్‌`ను అనౌన్స్ చేశాడు. ఇది ఈ సంవత్సరం నవంబర్‌లో రిలీజ్ కానున్న జానపద థ్రిల్లర్ కథ.

Read more: సొంత కొడుకు లేని బాధ కనిపిస్తుంది.. సంతానంపై ఫస్ట్ టైమ్‌ ఓపెన్‌ అయిన అనుపమ్‌ ఖేర్‌

also read: First Salary: రామ్‌ చరణ్‌ ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఏం చేశాడో తెలుసా? చిరంజీవి కూడా షాక్‌ అయిన సందర్భం