Anupam Kher: అనుపమ్ ఖేర్ తన జీవితంలోని లోటు గురించి మాట్లాడారు. తనకు పిల్లలు లేరనే బాధ ఉందని చెప్పారు. సికిందర్‌తో అనుబంధం ఉన్నప్పటికీ, సొంత పిల్లలు లేని లోటు ఉందని తెలిపారు.

Anupam Kher: అనుపమ్ ఖేర్‌కు సొంత పిల్లలు ఎందుకు లేరు? దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ 70 ఏళ్ల వయస్సులో ఉన్నారు. మార్చి 7, 1955న సిమ్లా, హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన అనుపమ్ ఖేర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ ఆయనకు సొంతంగా పిల్లలు లేరు.

దీని గురించి అనుపమ్‌కు మొదట్లో పెద్దగా బాధ లేకపోయినా, ఇప్పుడు వయసు మీద పడ్డాక పిల్లలు లేని లోటు కనిపిస్తోంది. 'ఎమర్జెన్సీ' వంటి సినిమాల్లో కనిపించిన అనుపమ్ ఖేర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

అనుపమ్ ఖేర్ జీవితంలో అతి పెద్ద లోటు

2024లో అనుపమ్ ఖేర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు సొంత పిల్లలు లేని లోటు చాలా ఉందని చెప్పారు. శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ, "నాకు దీని గురించి అంతగా అనిపించేది కాదు. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది. గత ఏడు-ఎనిమిది సంవత్సరాలుగా నేను ఇలా ఫీలవుతున్నాను.

సికిందర్ (రెండో భార్య మొదటి భర్త కొడుకు)తో నేను సంతోషంగా లేనని కాదు. కానీ సొంత బిడ్డ ఎదుగుతుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. వారితో అనుబంధం వేరుగా ఉంటుంది. ఇది నిజాయితీగల సమాధానం. నేను ఈ ప్రశ్నకు సమాధానం దాటవేయవచ్చు. కానీ నేను అలా చేయాలనుకోవడం లేదు. ఇది నా జీవితంలో ఒక విషాదం కాదు. కానీ ఒక్కోసారి నాకు పిల్లలు ఉంటే బాగుండేదనిపిస్తుంది."

అనుపమ్ ఖేర్‌కు ఎప్పుడు లోటు అనిపించింది?

అనుపమ్ ఇదే ఇంటర్వ్యూలో కొనసాగిస్తూ, "నేను పనిలో బిజీగా ఉన్నాను. కానీ 50-55 ఏళ్లు రాగానే నాకు ఏదో వెలితిగా అనిపించింది. దీనికి కారణం కిరణ్, సికిందర్ కూడా బిజీ అయిపోవడమే. నేను నా ఆర్గనైజేషన్ అనుపమ్ ఖేర్ ఫౌండేషన్‌లో పిల్లలతో కలిసి పనిచేస్తాను. మేము పిల్లలతో చాలా కార్యక్రమాలు చేస్తాము. ఒక్కోసారి నా స్నేహితుల పిల్లలను చూసినప్పుడు నాకు లోటుగా అనిపిస్తుంది. కానీ ఇది నష్టం అనే భావన కాదు."

అనుపమ్ ఖేర్ తండ్రి ఎందుకు కాలేకపోయారు?

అనుపమ్ ఖేర్ మొదటి వివాహం 1979లో మధుమాల్తి కపూర్‌తో జరిగింది. కానీ అది ఏడాదిలోనే ముగిసింది. ఆ తర్వాత 1985లో కిరణ్ ఖేర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. కిరణ్‌కు అప్పటికే నాలుగేళ్ల కొడుకు సికిందర్ ఉన్నాడు (కిరణ్, ఆమె మొదటి భర్త గౌతమ్ బేరి కుమారుడు). అనుపమ్, కిరణ్ పిల్లల కోసం ప్రయత్నించారని చెబుతారు. కానీ అది సాధ్యం కాలేదు.

అనుపమ్‌ ఖేర్‌ ఇటీవల వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ మధ్య `కార్తికేయ 2`, `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రాల్లో నటించారు. ఇప్పుడు `ది ఇండియా హౌజ్‌`లో నటిస్తున్నారు. శుక్రవారం బర్త్ డే జరుపుకుంటున్న అనుపమ్‌ ఖేర్‌కి విషెస్‌ తెలియజేద్దాం. 

read more: Radhika Pandit: యష్‌ వైఫ్‌ రాధికా పండిట్ ఎన్ని హిట్స్ ఇచ్చారో తెలుసా? సినిమాలకు ఎందుకు దూరమైంది?

also read: Vishwambhara Release: అస్సలు తగ్గని మెగాస్టార్‌.. `విశ్వంభర` కొత్త రిలీజ్‌ డేట్‌?