కరోనా చాలా మంది చెడు చేస్తున్నా కొంత మందికి మాత్రం మంచి చేస్తుంది. లాక్‌ డౌన్‌ కారణంగా సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఇళ్లకే పరిమితం కావటంతో ఖాళీ సమయాన్ని ఒక్కొక్కరూ ఒక్కోలా వినియోగించుకున్నారు. చాలా మంది ఇంటి పనిలో నిమగ్నం కాగా, మరికొందరు సినీ ప్రముఖులు భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్ట్ లలో మరిన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక అందాల భామలైతే తమ అందానికి మరింత మెరుగులు దిద్దుకుంటున్నారు.

యంగ్  హీరోయిన్ల నుంచి సీనియర్ నటీమణుల వరకు తమ వర్క్‌ అవుట్‌ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ నటి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉండే అందాల భామ ఖుష్బూ. చబ్బీ చబ్బీ అందాలతో తమిళ ప్రేక్షకులను తన వంశం చేసుకున్న ఈ బ్యూటీ లాక్‌ డౌన్‌ కాలంలో ఫిట్ నెస్‌ మీద దృష్టి పెట్టింది.

ఏకంగా మూడు నెలల సమయంలో 15 కిలోల వరకు బరువు తగ్గి గుర్తు పట్టలేనంతగా మారిపోయింది ఖుష్పూ. స్లిమ్‌ లుక్‌లోకి మారిన ఈ బ్యూటీ తన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేయటంతో అవి వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు, సీరియల్స్‌లోనూ నటిస్తోంది ఈ సీనియర్ నటి. తాజాగా రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న అన్నాత్త సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. ఖుష్బూ తాజా లుక్‌ చూసిన అభిమానులు ఈ బ్యూటీ మళ్లీ హీరోయిన్‌గా నటించేంత గ్లామరస్‌గా తయారైందని కామెంట్‌ చేస్తున్నారు.