`మహానటి`గా పేరు తెచ్చుకున్న కీర్తిసురేష్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే ఆమె నటించిన మూవీ ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతుంది.   

కమర్షియల్‌ హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్ చేసి `మహానటి` చిత్రంతో తన ఇమేజ్‌ని మార్చేసుకుంది కీర్తిసురేష్‌. అందరిచేత ఇప్పుడు `మహానటి`గా పిలిపించుకుంటుంది. అంతేకాదు ఆ మూవీ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసి మెప్పించింది.

 కానీ ఏ మూవీ కూడా ఆడలేదు. దీంతో మళ్లీ కమర్షియల్‌ హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. `సర్కారు వారి పాట` చిత్రం నుంచే తన రూట్‌ మార్చింది. బాలీవుడ్‌ చిత్రంలో రెచ్చిపోయింది. గ్లామర్‌ షోతో ఆకట్టుకుంది. 

కీర్తిసురేష్‌ `ఉప్పు కప్పురంబు` డైరెక్ట్ ఓటీటీలోకి 

ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలను, కమర్షియల్‌ మూవీస్‌ని బ్యాలెన్స్ చేస్తుంది కీర్తిసురేష్‌. ప్రస్తుతం ఆమె వరుసగా మూవీస్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా కీర్తిసురేష్‌ మూవీ ఒకటి డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్‌ కాబోతుండటం విశేషం. కీర్తిసురేష్‌ నటిస్తున్న కొత్త సినిమా 'ఉప్పు కప్పురంబు'. 

ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించింది టీమ్. జూలై 4న OTTలో నేరుగా విడుదల కానున్నట్టు తెలిపింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా OTTలో స్ట్రీమింగ్ కానుంది. అని ఐ వి శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తితో పాటు సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

కీర్తిసురేష్‌ సినిమాలు 

కీర్తి సురేష్ నటించిన బాలీవుడ్ చిత్రం 'బేబీ జాన్'. వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామిఖా గబ్బీ, జాకీ ష్రాఫ్, జాకీర్ హుస్సేన్, రాజ్‌పాల్ యాదవ్, సాన్యా మల్హోత్రా నటించిన ఈ చిత్రానికి కలీస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.61 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు.

కీర్తి సురేష్ తమిళంలో నటిస్తున్న చిత్రాల్లో ‘రఘుతాత’ ప్రధానంగా ఉంది. సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యామిని యజ్ఞమూర్తి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్‌తోపాటు ఎంఎస్ భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు.

తెలుగులో కీర్తి సురేష్ చివరగా చిరంజీవి ‘భోళా శంకర్’లో నటించింది. ఇందులో చిరంజీవికి చెల్లిగా ఆమె కనిపించడం విశేషం. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. 

చిరంజీవి, కీర్తి సురేష్‌లతో పాటు తమన్నా, సుశాంత్, తరుణ్ అరోరా, సాయాజీ షిండే, పి. రవిశంకర్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, రఘుబాబు, తులసి, శ్రీముఖి, వేణు, హర్ష, సత్య, సితార తదితరులు నటించారు. డూడ్లీ ఛాయాగ్రహణం అందించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అనంతరం తెలుగులో కీర్తి సురేష్‌ సినిమాలు తగ్గించింది.