శ్యామల చెప్పిన లిస్ట్ కి కౌశల్ ఆర్మీ పంచ్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Sep 2018, 2:55 PM IST
kaushal army comments on shyamala
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతుంది. సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు

బిగ్ బాస్ సీజన్ 2 రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతుంది. సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో శ్యామల ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

శ్యామలని స్టేజ్ మీదకి పిలిచిన నాని.. టాప్ త్రీ కంటెస్టెంట్స్ లో ఎవరుంటారని అనుకుంటున్నారు..? అని అడగగా దానికి గీతామాధురి, తనీష్, రోల్ రైడా పేర్లను చెప్పింది. కౌశల్ పేరు చెప్పకుండా మిగిలిన కంటెస్టెంట్స్ పేర్లు చెప్పడంతో శ్యామలపై కౌశల్ ఆర్మీ విమర్శలు చేస్తోంది. రీఎంట్రీ సమయంలో తము ఓట్లు వేస్తేనే లోపలకి వెళ్లిన శ్యామల ఇప్పుడు కనీసం టాప్ త్రీ లిస్ట్ లో కౌశల్ పేరు చెప్పకుండా మిగిలిన వారి పేర్లు చెబుతుందా..? అంటూ ఫైర్ అవుతున్నారు.

మరికొందరు నువ్వు చెప్పింది నెక్స్ట్ ఎలిమినేషన్ కాబోయే వారి లిస్ట్ అంటూ పంచ్ లు వేస్తున్నారు. ఎలా చూసుకున్నా.. మొదటి మూడు స్థానాల్లో కౌశల్ ఉండడం ఖాయం. అలాంటిది కావాలనే శ్యామల అతడి పేరు ప్రస్తావించలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెని ట్రోల్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు.. 

బిగ్ బాస్2: కౌశల్ కి టైటిల్ రాకపోతే..?

బిగ్ బాస్2: శ్యామల అవుట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!

బిగ్ బాస్2: గీతామాధురి కోసం బిగ్ బాస్ గేమ్!

బిగ్ బాస్2: కారణం చెప్పి ఆమెను బయటకి పంపనున్నారా..?

loader