బిగ్ బాస్ హౌస్ లో ఏ కంటెస్టెంట్ కి దక్కని ఆదరణ కౌశల్ కి దక్కింది. ప్రేక్షకుల్లో ఆయన క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే ఆయన కోసం కౌశల్ ఆర్మీ తరయారైంది. అక్కడితో విషయం ఆగలేదు. నిన్న ఏకంగా కౌశల్ కోసం 2కె రన్ నిర్వహించింది కౌశల్ ఆర్మీ. దీనికి విశేష ప్రేక్షకారణ లభించింది. కౌశల్ ఆర్మీతో పాటు వందల మంది జనాలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

స్టార్ హీరోలను సైతం ఈ 2కె రన్ అవాక్కయ్యాలే చేసింది. కౌశల్ కి ప్రేక్షకుల్లో ఇంతగా పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే బిగ్ బాస్ టైటిల్ ఆయనకి రాకపోతే ఏం జరుగుతుందో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. బిగ్ బాస్ కేవలం ఆడియన్స్ ఓట్లతో నడిచే రియాలిటీ షో. ఇప్పటివరకు హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే కౌశల్ కే ఎక్కువ ఓట్లు నమోదయ్యాయి.

కానీ బిగ్ బాస్ నిర్వాహకుల ఆలోచన మరో విధంగా ఉందని టాక్. వారికి కౌశల్ ని విజేతగా ప్రకటించే ఆలోచన లేదని సమాచారం. కానీ ఈ 2కె రన్ వారికి కూడా షాక్ ఇచ్చిందట. కచ్చితంగా టైటిల్ కౌశల్ కి ఇవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అలా కాకుండా మరొకరికి టైటిల్ ప్రకటిస్తే ఆ ఎఫెక్ట్ తదుపరి సీజన్లపై పడే ఛాన్స్ ఉంది. దీంతో ఏం చేయాలో తోచక బిగ్ బాస్ టీమ్ ఆలోచనలో పడినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు.. 

బిగ్ బాస్2: శ్యామల అవుట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!

బిగ్ బాస్2: గీతామాధురి కోసం బిగ్ బాస్ గేమ్!

బిగ్ బాస్2: కారణం చెప్పి ఆమెను బయటకి పంపనున్నారా..?