సౌత్ నార్త్‌ అన్న తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన చాలా మంది కథలను వెండితెరకెక్కిస్తున్నారు ఫిలిం మేకర్స్. ఇప్పటికే చాలా మంది బయోపిక్‌లు తెరకెక్కగా మరికొన్ని బయోగ్రఫిలు చర్చల దశలో ఉన్నాయి. అదే బాటలో తాజాగా మరో బయోపిక్‌కు రంగం సిద్ధమైంది.

భారత్‌ తరపున ఒలింపిక్‌ పతకం సాధించిన తొలి మహిళ కరణం మల్లేశ్వరి కథను వెండితెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. ఎంతో మంది మహిళలకు ఇన్సిపిరేషన్‌గా నిలిచిన మల్లేశ్వరి కథను పాన్‌ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనుంది.

ఎంవీవీ సినిమా, కోనా ఫిలిం కార్పోరేషన్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కోనా వెంకట్‌ కథా స్క్రీన్‌ప్లే అందిస్తుండగా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.