‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. స్టైలిష్ డైరెక్టర్ సురెందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ పై  ఖైదీ నంబర్ 150 గ్రాండ్ సక్సెస్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

చిరంజీవి పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో..ఇప్పుడూ అలాగే ఉన్నారని..బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150కి జనం బ్రహ్మరథం పట్టారు.  ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' నటిస్తున్న చిరంజీవి ఈ మూవీలో స్వాతంత్ర పోరాటం సమయంలో ఓ మహాయోధుడిగా నటిస్తున్నారు. ఆ యోధుడి వీర గాథ ఆదారంగా రూపొందుతున్న చిత్రం ఇది.  ఈ సినిమాకి అవసరమైన లుక్ పై చిరూ దృష్టి పెట్టారు.

 

కథ .. కథనాలు .. నటీనటుల ఎంపిక పనుల్లో దర్శకుడు సురేందర్ రెడ్డి బిజీగా వున్నాడు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమాలో, కథానాయికలుగా ఐశ్వర్య రాయ్ .. నయనతారల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఉయ్యాల వాడలో ఓ కీలక   పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను తీసుకోనున్నారనేది తాజా సమాచారం.

 

ఆల్రెడీ ఆయనని సంప్రదించడం .. పాత్ర గురించి వివరించడం జరిగిపోయిందని అంటున్నారు.  ఇప్పటకే మెగా అల్లుడు అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి'లో ఉపేంద్ర మంచి పవర్ ఫుల్ రోల్ చేసి మెప్పించాడు. ఇక   'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమాలో ఆయన రోల్ ఎలా ఉంటుందో చూడాలి.