నటి రన్యా రావ్ అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయింది. కస్టమ్స్ అధికారులు 15 కేజీల బంగారం సీజ్ చేసి విచారణ చేస్తున్నారు.

 కన్నడ హీరోయిన్‌ రన్యా రావ్‌ పోలీసులకు దొరికిపోయింది. అక్రమంగా బంగారం తరలిస్తున్న ఆరోపణలతో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆమెని పట్టుకున్నారు. ఏడీజీపీ రామచంద్ర రావు గారి కూతురైన రన్యా రావ్, కిచ్చా సుదీప్‌తో కలిసి 'మణిక్య' సినిమాలో నటించింది. అంతేకాదు, 'పటాకి' ఇంకా తమిళంలో 'వాఘా' సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది.

15 కేజీలతో కస్టమ్స్ పోలీసులకు దొరికిపోయిన రన్యా రావ్‌..

 తాజాగా  సుమారు 15 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న కేసులో నటి రన్యా రావును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 4న అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో బంగారంతో సహా పట్టుకుని విచారిస్తున్నారు. రన్యా దుబాయ్ నుండి మార్చి 3న అర్ధరాత్రి బెంగళూరుకు వచ్చింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగానే డీఆర్ఐ అధికారులు మార్చి 4న రాత్రి రన్యాను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

కిచ్చా సుదీప్‌తో `మణిక్య` చిత్రంతో రన్యా రావు పాపులర్‌

ఆమె విదేశాల నుండి ఎక్కువ బంగారం తెచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. సోమవారం రాత్రే నాగవరలోని డీఆర్ఐ ఆఫీసుకు తీసుకెళ్లి అధికారులు విచారిస్తున్నారు.  రన్యా రావ్ మే 28, 1993న కర్ణాటకలోని చిక్కమగళూరులో జన్మించింది. 2014లో కిచ్చా సుదీప్ హీరోగా నటించి డైరెక్ట్ చేసిన 'మణిక్య' సినిమా రన్యా రావ్ మొదటి సినిమా. 2017లో విడుదలైన గణేష్ నటించిన కన్నడ కామెడీ సినిమా 'పటాకి'లో జర్నలిస్ట్ పాత్రలో నటించింది.

read  more: రామ్‌ చరణ్‌లో అది చూసి కుళ్లుకున్న చిరంజీవి హీరోయిన్లు.. షూటింగ్‌ సెట్‌కి వెళితే ఏం చేశారో తెలుసా?

also read: ఇద్దరు కొడుకులతో రొమాన్స్ అయిపోయింది, ఇప్పుడు తండ్రితో పూజా హెగ్డే ఆటాపాటా ?