- Home
- Entertainment
- రామ్ చరణ్‌లో అది చూసి కుళ్లుకున్న చిరంజీవి హీరోయిన్లు.. షూటింగ్ సెట్‌కి వెళితే ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్‌లో అది చూసి కుళ్లుకున్న చిరంజీవి హీరోయిన్లు.. షూటింగ్ సెట్‌కి వెళితే ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్‌ని చిన్నప్పుడు చిరంజీవి హీరోయిన్లు ఆటపట్టించేవారట. ప్రత్యేకంగా ఆ విషయంలో కుళ్లుకునే వారట. చరణ్ పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
chiranjeevi, ram charan
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఆయన వారసుడిగా చరణ్ రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిన్నప్పుడు తన అనుభవాలను పంచుకున్నారు రామ్ చరణ్. సెలవుల్లో నాన్నగారి సినిమా సెట్లకి వెళితే హీరోయిన్లు ఎలా టీజ్ చేసేవారు తెలిపారు. ఆ విషయంలో కుళ్లు కునేవారట.
chiranjeevi, ram charan
రామ్ చరణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చరణ్ స్కూటింగ్ అంతా చెన్నైలోనే జరిగింది. అయితే ఆ స్కూల్‌లో ఎవరికీ తాను చిరంజీవి కొడుకు అని తెలియదట.
తెలిస్తే ఎవరూ తనతో అంత ఫ్రీగా ఉండరని, చిరంజీవి చెప్పనిచ్చేవారు కాదని, తాను కూడా చెప్పేవాడిని కాదని తెలిపారు. అయితే చిరంజీవి స్టడీస్ విషయంలో స్టిక్ట్ గా ఉండేవారు. స్కూల్ టైమ్‌లో సెట్‌కి రానిచ్చేవారు కాదట, కానీ చరణ్‌కి మాత్రం సినిమా షూటింగ్‌లకు రావాలని బాగా ఉండేదట.
Radhika Sarathkumar
ఇక హాలీడేస్ వస్తే మాత్రం షూటింగ్‌లలో వాలిపోయేవాడట. చిరంజీవితోపాటు వెళ్లేవారట. అయితే అక్కడ హీరోయిన్లు తనని టీజ్ చేసేవారని తెలిపారు చరణ్. తనకు ఊహ వచ్చినప్పుడు `రాజా విక్రమార్క` మూవీ షూటింగ్‌కి వెళ్లాడు చరణ్. అక్కడ చిరంజీవి హీరోయిన్ రాధ, రాధిక చాలా ముద్దు చేసేవారట.
తన కనురెప్పలు బాగా ఒత్తుగా ఉండేవట. హీరోయిన్ రాధిక చరణ్‌ని దగ్గరకు తీసుకుని `నీ ఐ లాషెస్ నిజమైనవేనా` అని లాగి చూసేదట. నాక్కూడా కనురెప్పలు నీలా ఉంటే భలే ఉండేదని, మేకప్ వేసుకునే పని తప్పేదని టీజింగ్ చేసేవారట. సితారకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు చరణ్.
Ram Charan
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ ట్యాగ్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ని సాధించుకున్నాడు. `ఆర్‌ఆర్‌ఆర్`తో రామ్ చరణ్ రేంజ్ అమాంతం పెరిగింది.
అయితే ఆ తర్వాత ఆ స్థాయి హిట్ పడలేదు. ఇటీవల వచ్చిన `గేమ్ ఛేంజర్` బాగా డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు మరో రా అండ్ రస్టిక మూవీతో రాబోతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో `ఆర్‌సీ16`లో నటిస్తున్నారు.
ఇందులో అంధుడిగా చరణ్ కనిపిస్తారని సమాచారం. శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది ఎండింగ్‌లో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
read more: ఆడవారిపై చిరంజీవి నోరుజారడానికి కారణం ఏంటో తెలుసా? స్వయంగా అది ఫేస్ చేస్తున్నాడా?
also read: ఇద్దరు కొడుకులతో రొమాన్స్ అయిపోయింది, ఇప్పుడు తండ్రితో పూజా హెగ్డే ఆటాపాటా ?