డైరెక్టర్ క్రిష్ బాలీవుడ్ లో కంగనా ప్రధాన పాత్రలో 'మణికర్ణిక' సినిమాను తెరకెక్కించాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సినిమా నుండి బయటకి వచ్చేశాడు. దానికి కారణం 'ఎన్టీఆర్' బయోపిక్. దీంతో క్రిష్ కి బదులుగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది కంగనా.. నిజానికి కొంత ప్యాచ్ వర్క్, కొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

అయితే ఎప్పుడైతే డైరెక్టర్ గా కంగనా రంగంలోకి దిగిందో.. నటుడు సోనుసూద్ ప్రాజెక్ట్ నుండి బయటకి వెళ్లిపోయాడు. క్రిష్ బయటకి వెళ్ళినప్పటి నుండి ఈ సినిమా వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఇటీవల సినిమా టీజర్ విడుదలైంది.

ఈ టీజర్ తో క్రిష్ పనితనాన్ని కొనియాడారు. టీజర్ విడుదలయ్యే సమయంలో దర్శకుడిగా క్రిష్ కి క్రెడిట్ దక్కదని ఆ స్థానంలో తన పేరు వేసుకుంటుందని కంగనాని టార్గెట్ చేశారు. కానీ టీజర్ లో మాత్రం దర్శకుడిగా క్రిష్ పేరే వేశారు. కానీ ఇప్పుడు వెండితెరపై కనిపించే సినిమాలో మాత్రం దర్శకుడిగా క్రిష్ పేరు ఉండదని అంటున్నారు. డైరెక్టర్ దగ్గర కంగనా తన పేరుని వేసుకొని క్రిష్ ని అవమానించడానికి సిద్ధమవుతోందని ఇన్సైడ్ టాక్.

సెన్సార్ బోర్డ్ కి కూడా క్రిష్ పేరు తీసేసి తన పేరు పెట్టుకొనే పంపబోతుందని అంటున్నారు. అయితే క్రిష్ పేరు పూర్తిగా తీసేయకుండా.. అసిస్టెంట్ డైరెక్టర్ లేదంటే డైరెక్షన్ సూపర్వైజర్ కేటగిరీలో పెడుతుందట. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన వివాదంపై క్రిష్ స్పందించనే లేదు. మరి ఇప్పటికైనా స్పందిస్తాడేమో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

క్రిష్ వదిలేస్తే.. ఆమె డైరెక్ట్ చేస్తోందట!

'మణికర్ణిక' నుండి ప్రొడ్యూసర్ అవుట్.. కారమేమిటంటే..?

స్టార్ హీరోయిన్ క్రిష్ ను అవమానించిందా..?