Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హీరోయిన్ క్రిష్ ను అవమానించిందా..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ బాలీవుడ్ లో 'మణికర్ణిక' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కొన్ని రీషూట్లు ఉన్నప్పటికీ క్రిష్ ఈ సినిమాను పక్కన పెట్టేసి 'ఎన్టీఆర్' బయోపిక్ సెట్స్ పైకి వెళ్లిపోయాడు. 

has kangana ranaut ousted director krish
Author
Hyderabad, First Published Sep 3, 2018, 4:16 PM IST

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ బాలీవుడ్ లో 'మణికర్ణిక' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కొన్ని రీషూట్లు ఉన్నప్పటికీ క్రిష్ ఈ సినిమాను పక్కన పెట్టేసి 'ఎన్టీఆర్' బయోపిక్ సెట్స్ పైకి వెళ్లిపోయాడు. ఇన్ని రోజులు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ కారణంగా బయటకి వచ్చేశాడనుకుంటే తాజాగా బాలీవుడ్ మీడియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం క్రిష్ ను కంగనా అవమానించడం వలనే బయటకి వచ్చేశారని సమాచారం.

కంగనా చర్యలను అవమానంగా భావించిన క్రిష్ ఈ సినిమా విషయాలను పట్టించుకోవడం మానేశాడని టాక్. 'మణికర్ణిక' సినిమా రైటింగ్, డైరెక్షన్ విషయాల్లో కంగనా మితిమీరిన జోక్యంతో క్రిష్ అసహనానికి గురై ఈ సినిమా విషయాలను పట్టించుకోవడం లేడనేది బాలీవుడ్ మీడియా కథనం. నటుడు సోనూసూద్ కూడా సినిమా నుండి తప్పుకోవడం, దానికి కారణం కంగనా అన్నట్లుగా కామెంట్లు చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.

తాజాగా 'మణికర్ణిక' నిర్మాత కుమార్ జైన్ ఓ ప్రకటన వెల్లడిస్తూ.. 'మణికర్ణిక' సినిమాకు సంబంధించి రీషూట్ చేయాల్సిన పరిస్థితి కలిగింది. ఈ విషయంలో కంగనా, క్రిష్ ల మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాల వలన ఇలాంటి వార్తలు వస్తున్నాయని, ఈ సినిమాకు క్రిష్ దర్శకుడిగా కొనసాగుతాడని నిర్మాత.. స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా.. క్రిష్ మాత్రం ఈ విషయంపై మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios