బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పటివరకు హీరోయిన్ గానే అందరికీ తెలుసు. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకొని దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తోందని తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇప్పటివరకు హీరోయిన్ గానే అందరికీ తెలుసు. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకొని దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తోందని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో కంగనా హీరోయిన్ గా 'మణికర్ణిక' అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసేసిన క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం సెట్స్ పైకి వెళ్లిపోయాడు.

అయితే 'మణికర్ణిక' సినిమాకు సంబంధించిన కొంత ప్యాచ్ వర్క్ అలానే మిగిలివుంది. దీనికోసం క్రిష్ 'ఎన్టీఆర్' సెట్స్ నుండి రాలేకపోవడంతో కంగనా ఆ ప్యాచ్ వర్క్ కు డైరెక్టర్ గా పనిచేస్తోంది. అది కూడా దర్శకుడు క్రిష్ అనుమతి తీసుకొనే అని తెలుస్తోంది. ప్రస్తతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. క్రిష్ ప్రతిరోజు ఆమెతో మాట్లాడుతూ పెండింగ్ వర్క్ ని పూర్తి చేయిస్తున్నాడని తెలుస్తోంది.

ఇప్పటివరకు నటిగా జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన కంగనా ఇప్పుడు డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించి తన సత్తా చాటుతోంది. విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ సినిమాలో కంగనా.. ఝాన్సీ లక్ష్మీభాయ్ గా కనిపించనుంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది.

ఇది కూడా చదవండి.. 

స్టార్ హీరోయిన్ పై పోలీస్ కేసు!