Asianet News TeluguAsianet News Telugu

మోదీపై విమర్షలు, హర్ట్ అయిన కంగనా రనౌత్, నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్.. ఏమంటుందంటే..?

ప్రధాని మోదీని విమర్షిస్తే ఊరుకునేది లేదు అంటోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఏకంగా నెటిజన్లకు వార్నింగ్ ఇస్తోంది సీనియర్ బ్యూటీ. ఇంతకీ ఏమంటుందంటే..? 
 

Kangana Ranaut SLAMS Netizens For Calling PM Modi Panauti JMS
Author
First Published Nov 23, 2023, 12:16 PM IST

అటు సినిమాలు.. ఇటుసమాజ సేవ.. అప్పుడప్పుడు రాజకీయాలు.. కంగనా రనౌత్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అర్ధం కావడంలేదు. బాలీవుడ్  అంతా తనను దూరం పెడుతున్నా.. పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుపోతోంది కంగనా. ఎవరు ఎంతటి వారు అనేది చూడకుండా.. తను అనుకున్నది తాను చెప్పేస్తుంది. ఏమీ దాచుకోకుండా ఎదుటివారిని కడిగిపడేస్తోంది. కాగా కంగనాకు బీజేపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ కూడా ఉంది. అంతే కాదు ప్రధానికి ఆమె చాలా పెద్ద అభిమాని కూడా. 

Sara Tendulkar: నేను కూడా బాధితురాలినే, డీప్ ఫేక్ పై సారా టెండూల్కర్ సంచలన పోస్ట్.

ఈక్రమంలో పోలిటికల్ గా కాని.. సినిమాల పరంగా కాని.. కామెంట్లకు కౌంటర్లు ఇవ్వడంతో కంగనాను మించినవారు లేదు. తాజాగా ప్రధాని మోదీపై నెటిజన్లు చేస్తున్న ట్రోలింగ్ కు గట్టిగా జవాబిచ్చింది కంగనా రనౌత్. మోదీని పనౌటీ' అని పిలిచినందుకు నెటిజన్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఆమె ఈ విధంగా తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. 

Kangana Ranaut SLAMS Netizens For Calling PM Modi Panauti JMS

మోదీని పనౌటీ అని పిలుచుకునే వారు కొన్ని వాస్తవాలు  తెలుసుకోవాలి..  తన జీవితంలో ఎన్నడూ ఎన్నికల్లో ఓడిపోని అరుదైన రాజకీయ దిగ్గజాలలో మోదీ కూడా ఒకరు. ఆయన తాకినదేదైనా బంగారం అవుతుంది, ఆయన పాలనలో గుజరాత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా అవతరించింది. అంతే కాదు ఆయన ప్రభాదిగా..  ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ కేవలం 4 ట్రిలియన్‌లను తాకింది, రాజకీయాల్లో కూడా ఆయన పాటించే విలువలు అద్భుతం. అందుకే దుష్ప్రచారాన్ని మానండి అని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

Animal: యానిమల్ సెన్సార్ కంప్లీట్, రన్ టైం రివీల్ చేసిన సందీప్ రెడ్డి, అన్ని గంటులు చూస్తారా..?

కంగనా రనౌత్  బాలీవుడ్ లో నటించిన చివరి సినిమా  అన్షుల్ చౌహాన్ మరియు వరుణ్ మిత్రతో కలిసి చేసిన  తేజస్‌. సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె  IAF అధికారి తేజస్ గిల్ పాత్రను పోషించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక కంగనా బాలీవుడ్ కంటే కూడా సౌత్ లో ఎక్కువగా యాక్టీవ్ గా ఉంటోంది. రీసెంట్ గా కంగనా  తమిళంలో చంద్రముఖి )కి సీక్వెల్ అయిన చంద్రముఖి 2లో  నటించింది. రాఘవా లారెన్స్ హీరోగా నటించిన ఈసినిమా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేక పోయింది. 

ఇక ఎక్కువగా సౌత్ సినిమాలు చేస్తోంది కంగనా. మరో వైపు బాలీవుడ్ లో కంగనా నటించిన  ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో ఆమె  ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి మరియు మిలింద్ సోమన్ కూడా నటించనున్నారు. ఇక అటు తమిళంలో  సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటించబోతుంది బాలీవుడ్ బ్యూటీ. ఈసినిమాలో మాధవన్‌తో కలిసి మరోసారి తెరను పంచుకోబోతోంది. రీసెంట్ గా  చెన్నైలో ఈ  సినిమా షూటింగ్‌ స్టార్ట్ అవ్వగా. ఈ షూటింగ్ కు రజినీకాంత్ వచ్చి కంగనాను సర్ ప్రైజ్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios