Asianet News TeluguAsianet News Telugu

Animal: యానిమల్ సెన్సార్ కంప్లీట్, రన్ టైం రివీల్ చేసిన సందీప్ రెడ్డి, అన్ని గంటులు చూస్తారా..?

రిలీజ్ కురెడీ అవుతుంది యానిమల్ మూవీ. సెన్సార్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇక ఈమూవీరన్ టైమ్ పై మొదటి నుంచి రకరకాల వార్తలు హైలెట్ అవుతూ వస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా రన్ టైమ్ ను రివిల్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

Ranbir Kapoor Animal Movie Sencare Complete and Stocking Run Time JMS
Author
First Published Nov 22, 2023, 10:17 PM IST

ఇప్పటికే బాలీవుడ్ లో దర్శకుడిగా నిలబడ్డాడు సందీప్ రెడ్డి వంగా.. ఇక యానిమల్ సినిమాలో  బాలీవుడ్‌లో మరో సంచలనం సృష్టిచడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్  యంగ్ స్టార్ హీరో  రణబీర్ కపూర్ కు లవర్ బాయ్.. ప్లే బాయ్ ఇమేజ్ ఉండగా.. అతన్ని  ఊర మాస్ క్యారెక్టర్‌లో మోస్ట్ వైలెంట్ హీరోగా నార్త్ ఆడియన్స్ కు పరిచయం చేసే పని పెట్టుకున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో యానిమల్ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. వాటిని రీసెంట్ గా వచ్చిన  టీజర్ వాటికి ఇంకా పెంచేసింది. ఈ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

డెంగీ ఫీవర్ తో హాస్పిటల్ లో చేరిన బాలీవుడ్ నటి, ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ..

ఇక ఈమూవీ నుంచి  నవంబర్ 23న ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ కోసం  ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్నారు. యానిమల్' విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడంలేదు సందీప్ రెడ్డి వంగ. ప్రమోషన్స్ ను కూడా ఓ రేంజ్ లో చేసుకుంటూ వస్తున్నారు.  మరీ ముఖ్యంగా 'యానిమల్' రన్ టైం గురించి గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో ఓ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈసినిమా రన్ టైమ్ తో రికార్డ్ సృష్టించబోతోంది అంటూ వార్తలు వైరల్ అవ్వగా.. రికార్డ్స్ తరువాత సంగతి కాని.. రన్ టైమ్ విషయంలో మాత్రం అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. ]

 

ఇప్పటివరకు  సినిమాకి లేని రన్ టైం 'యానిమల్' మూవీకి ఉండబోతుందని, ఏకంగా మూడున్నర గంటల రన్ టైం తో మూవీ ఉంటుందని అందరు అనుకున్నారు. అదే నిజం అయ్యింది. యానిమల్' మూవీ రన్ టైం గురించి స్వయంగా సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చాడు. యానిమల్' మూవీ ఏకంగా 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్ల  షాకింగ్ రన్ టైమ్ తో రిలీజ్ కాబోతోంది.  16 ప్రేమ్స్ తో రాబోతుందని సందీప్ వంగా వెల్లడించాడు.  ఈ విధంగా ఆయన ట్వీట్ చేశారు. 

#Thandel: తండేల్ గా వస్తున్న నాగచైతన్య, NC23 టైటిల్ పోస్టర్ రిలీజ్

అంతేకాకుండా గతంలో కబీర్ సింగ్ సినిమాకి వచ్చినట్టుగానే 'యానిమల్'కి కూడా 'A' సర్టిఫికెట్ వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ హిస్టరీలోనే 'A' సర్టిఫికెట్‌తో రూ.300 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమా రాలేదు. సందీప్ వంగా తెరకెక్కించిన 'కబీర్ సింగ్' మూవీకే ఆ ఘనత దక్కింది. ఇప్పుడు అదే 'A' సర్టిఫికెట్‌తో రాబోతున్న 'యానిమల్' మూవీతో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగా.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios