Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ తో నటించడానికి నేను రెడీ.. లేటెందుకంటే..? శ్రీవారి దర్శనం చేసుకున్న కల్యాణ్ రామ్...

తన సినిమా టీమ్ తో కలిసి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. బింబిసారి సినిమా రిలీజ్ నేపథ్యంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 
 

Kalyan Ram and Bimbisara movie team visits tirumala temple
Author
Hyderabad, First Published Jul 31, 2022, 12:16 PM IST

మంచి కథ దొరికితే ఎన్టీఆర్ తో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీగా ఉన్నానన్నారు కల్యాణ్ రామ్. తన టీమ్ తోకలిసి శ్రీవారిని దర్శించుకున్నారు నందమూరి హీరో. ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాల్సిందే అని పట్టుదలతో ఉన్నాడు కల్యాణ్ రామ్. అందుకు కావల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎంతో కాన్పిడెంట్ తో మాట్లాడాడు కల్యాణ్ రామ్. అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడాఈ సినిమా సక్సెస్ పై విశ్వాసం వ్యక్తం చేశాడు. ఎప్పటి నుంచో ఎన్నో రకాల సినిమాలు చేశాడు కల్యాణ్ రామ్. చాలా ప్రయెగాలు చేశాడు. అయినా ఏదీ కల్యాణ్ రామ్ కు సక్సెస్ ఇవ్వలేదు. 

ఇక ఈసారి కొత్త దర్శకడుతో సరికొత్తగా ప్రయోగానికి పూనుకున్నాడు. ఎప్పుడో చరిత్రలో మిగిలిపోయిన బింబిసారుడి కథను బయటకు తీశాడు.  కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన బింబిసార వచ్చే నెల 5న ప్రపంచ  వ్యాప్తంగా  ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో కళ్యాణ్‌ రామ్‌.. సినిమా విజయాన్ని కాంక్షిస్తూ.. మూవీ టీమ్ తో కలిసి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 

శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం అనంతరం వారికి ఆలయ పండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్చనం అందిగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయం వెలుపల కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 5న తమ బింబిసార సినిమా  ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని చెప్పారు. సినిమా విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్ధిస్తూ, స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామన్నారు. 

ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. మీడియా మిత్రులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ తో ఎప్పుడు కలిసి నటిస్తారు అని అడగ్గా.. మంచి కథ వస్తే జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి తాను సిద్థంగా ఉన్నట్టు చెప్పారు. కథ కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక బింబిసార సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios