కాజల్ అగర్వాల్ అవుట్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన త్రిష
లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చాలా రోజుల క్రితం ఇండియన్ 2 చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి.
లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చాలా రోజుల క్రితం ఇండియన్ 2 చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇండియన్ 2 షూటింగ్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు యూనిట్ సభ్యులు మరణించారు. స్వయంగా దర్శకుడు శంకర్ గాయపడ్డారు.
ఆ తర్వాత Shankar కు, ఈ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కి మధ్య విభేదాలు తలెత్తాయి. దీనితో Indian 2 దాదాపుగా అటకెక్కినంత పని అయింది. ఎట్టకేలకు చర్చలు ఫలించడంతో తిరిగి ఈ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం శంకర్ రాంచరణ్ మూవీతో బిజీగా ఉన్నారు. డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని ఇండియన్ 2 చిత్రాన్ని కూడా ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా శంకర్ కి మరో సమస్య వచ్చింది. ఇండియన్ 2 షూటింగ్ చాలా ఆలస్యం అవుతుండడంతో డేట్లు అడ్జెస్ట్ చేయలేక Kajal Aggarwal ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాజల్ ప్లేస్ లోకి చెన్నై ముద్దుగుమ్మ త్రిషని శంకర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు కాజల్ పై చిత్రీకరించిన సన్నివేశాలన్నింటినీ త్రిషతో రీషూట్ చేయాల్సి ఉంది. అలాగే నటుడు వివేక్ కూడా ఆ మధ్య మరణించారు. దీనితో ఆయన సన్నివేశాల్ని కూడా వేరో నటుడితో రీ షూట్ చేయక తప్పదు.
Also read: RRR Movie: బిగ్ న్యూస్.. రాజమౌళి కోసం పోటీ నుంచి తప్పుకున్న అలియా భట్
దాదాపు పాతికేళ్ల క్రితం శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ చిత్రం అఖండ విజయం సొంతం చేసుకుంది. ఆ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో జీవించారు. ఇన్నేళ్లకు ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతుండడంతో ఆసక్తి నెలకొంది.
Also Read: పాపం.. రష్మిక ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా, సో హాట్.. ఒక రేంజ్ లో వైరల్