RRR Movie: బిగ్ న్యూస్.. రాజమౌళి కోసం పోటీ నుంచి తప్పుకున్న అలియా భట్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ లోకం ఎదురుచూస్తోంది. రాంచరణ్, ఎన్టీఆర్ కళ్ళు చెదిరే విన్యాసాలు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ లోకం ఎదురుచూస్తోంది. రాంచరణ్, ఎన్టీఆర్ కళ్ళు చెదిరే విన్యాసాలు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ వీడియో, నాటు నాటు సాంగ్ అంచనాలని రెట్టింపు చేసేశాయి. 1920 కాలం నాటి బ్రిటిష్ వారి పాలన పరిస్థితుల నేపథ్యంలో రాజమౌళి ఈ కల్పిత గాధని తెరమీద చూపించబోతున్నారు.
కథ కల్పితమే అయినప్పటికీ Ram Charan, NTR రియల్ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో నటిస్తుండడం విశేషం. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన RRR Movie కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జనవరి 7న ఈ చిత్రాన్ని జక్కన్న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిత్రాలన్నీ ఒక్కసారిగా బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. దీనితో పెద్ద చిత్రాలకు పోటీ తప్పడం లేదు. రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదలైతే వసూళ్లపై తప్పకుండా ప్రభావం ఉంటుంది. ఆర్ఆర్ఆర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. రాజమౌళి చిత్రానికి నార్త్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆర్ఆర్ఆర్ మూవీలో అలియా భట్.. రాంచరణ్ కి జోడిగా సీత పాత్రలో నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ టైంలోనే అలియా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించిన 'గంగూబాయి కథియవాడి'(Gangubai Kathiawadi) చిత్రం రిలీజ్ కు రెడీ అయింది. జనవరి 6న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ముందుగా నిర్ణయించారు. అయితే తాజాగా ' గంగూబాయి' చిత్ర యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ వాయిదా వేశారు. జనవరి 6న కాకుండా ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Also Read: పాపం.. రష్మిక ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా, సో హాట్.. ఒక రేంజ్ లో వైరల్
ఆర్ఆర్ఆర్ చిత్రం కోసమే అలియా, భన్సాలీల చిత్రం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. భన్సాలీ కూడా బాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడు. అలియా భట్ కి సూపర్ క్రేజ్ ఉంది. పైగా గంగూబాయి చిత్రంలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. అలియా, దేవగన్ ఇద్దరూ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలైతే నష్టం తప్పదు. అందువల్లే ఆర్ఆర్ఆర్ తో పోటీ నుంచి అలియా చిత్రం తప్పుకుంది. దీనితో హిందీలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి జనవరి 7న సోలో బిగ్ రిలీజ్ లభించింది.
Also Read: 2010లో ఆగిపోయిన రాంచరణ్, కాజల్ మూవీ.. మెగా పవర్ స్టార్ డ్రీమ్ నెరవేరబోతోంది