డైరెక్టర్ సురేందర్ రెడ్డి టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్నాడు. కెరీర్ ఆరంభంలో కళ్యాణ్ రామ్ తో 'అతనొక్కడే' సినిమా తీసి అతడికి మంచి సక్సెస్ ఇచ్చాడు సురేందర్ రెడ్డి. ఆ తరువాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇద్దరి కాంబినేషన్ లో 'అశోక్' అనే సినిమా వచ్చింది.

కానీ ఈ సినిమా సక్సెస్ కాలేదు. అయితే ఆ సినిమా తను ఇష్టపడి చేసింది కాదని చెబుతున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేందర్ రెడ్డి ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 'అతనొక్కడే' సినిమా తరువాత సురేందర్ రెడ్డి.. ప్రభాస్ తో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడట.

పెళ్లైన హీరోతో ప్రేమాయణం.. కన్ఫర్మ్ చేసిన పవన్ హీరోయిన్!

ఈ సినిమాకి సన్నాహాలు జరుగుతుండగా..అప్పటి ఎన్టీఆర్ మేనేజర్ రెండు, మూడు రోజులపాటు తన వెంటపడి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒప్పించాడని సురేందర్ చెప్పాడు. తాను ఏ విషయం చెప్పకుండానే సినిమా ఎలా చేయాలి, ఎక్కడ చేయాలనే విషయాలు మాట్లాడడంతో తనకు ఇబ్బందికరంగా అనిపించినా.. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేయకపోతే ఏం జరుగుతుందనే ఆలోచనతో ఇష్టంలేకుండానే సినిమా చేయడానికి అంగీకరించినట్లు చెప్పుకొచ్చాడు సురేందర్ రెడ్డి.

ఆ సమయంలో 'అశోక్' కథ తన చేతుల్లో పెట్టారని.. అయితే తను ప్రభాస్ కోసం అనుకున్న కథ మరో రకమైన కథ అని.. 'అశోక్' కథ తనకు సెట్ కాదని అనిపించిందా.. సినిమా చేయక తప్పని పరిస్థితుల్లో చేసినట్లుగా వెల్లడించాడు సురేందర్ రెడ్డి. సినిమా రిలీజైన ఇంతకాలానికి సురేందర్ రెడ్డి ఈ తరహా కామెంట్స్ చేయడం విచిత్రంగా ఉంది. ఆ తరువాతి రోజుల్లో ఎన్టీఆర్ తో 'ఊసరవెల్లి' అనే మరో సినిమా తీశాడు సురేందర్ రెడ్డి.