టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'కవచం' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈ వేడుకలో సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు చేసిన పనికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. 

వేదికపై ఉన్న కాజల్ ని ఛోటా సడెన్ గా ముద్దుపెట్టుకున్నాడు. ఈ చర్యతో కాజల్ సైతం షాక్ అయింది. అయినప్పటికీ ఛోటా మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ కాజల్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని అంత సులువుగా విడిచిపెట్టలేదు.

స్టేజ్ మీద ఒక మహిళతో ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ ఛోటాని టార్గెట్ చేశారు. దీనికి ఛోటా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అతడి మీద విమర్శలు చేయడం ఆపలేదు. ఇంత వ్యవహారం జరుగుతున్నా.. కాజల్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

ఇప్పుడు దీని మీద చర్చలు జోరుగా సాగడంతో ఆమె తనకు తెలిసిన వాళ్ల దగ్గర ఈ విషయంపై మాట్లడిందట. ''నా కెరీర్ మొదలైనప్పటి నుండి ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. ఇంకా చెప్పాలంటే నాకు గాడ్ ఫాదర్ వంటి వారు. అందుకే ఆ వేదికపై ఆయన చేసింది నాకేం తప్పుగా అనిపించలేదని'' తనను ఆ ముద్దు గురించి అడుగుతున్న వారికి తెలిపినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు..
ఆమె గుర్తొచ్చి కాజల్ ని ముద్దు పెట్టుకున్నా.. ఛోటా వివరణ!

కాజల్ కి ముద్దు పెడతాడా..? అతడిని బ్యాన్ చేయండి: అభిమానుల ఆగ్రహం!

స్టేజ్ మీద హగ్, కిస్.. ఊహించని ఘటనతో షాకైన కాజల్!