తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడుని బ్యాన్ చేయాలని కోరుతున్నారు కాజల్ అగర్వాల్ అభిమానులు. సోషల్ మీడియా వేదికగా ఛోటాపై విరుచుకుపడుతున్నారు. దీనంతటికీ కారణం ఇటీవల జరిగిన 'కవచం' సినిమా టీజర్ లాంచ్ లో ఛోటా.. కాజల్ ని ముద్దుపెట్టుకున్నాడు.

నిజానికి ఈ చర్యకి కాజల్ కూడా షాక్ అయింది. కానీ ఆమె కూడా కోప్పడితే ఇష్యూ పెద్దదవుతుందని భావించి అప్పటికప్పుడు ఏదో కవర్ చేసేసింది. ఆమె ఊరుకున్న ఆమె ఫ్యాన్స్ మాత్రం ఛోటాని వదలడం లేదు.

పబ్లిక్ గా స్టేజ్ మీద ఆమె ప్రమేయం లేకుండా కాజల్ కి ముద్దు పెడతావా..? ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదా..? అంటూ ఛోటాపై మండిపడుతున్నారు. ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం మంది ఛోటా చేసిన పనికి ఛీ కొడుతున్నారు.

అదే వేడుకలో స్టేజ్ కింద మరో హీరోయిన్ మెహ్రీన్ తో కూడా అతడు తప్పుగా ప్రవర్తించాడని టాక్. మరి ఈ విషయంపై ఛోటా ఎలా స్పందిస్తాడో.. చూడాలి!

సంబంధిత వార్త..

స్టేజ్ మీద హగ్, కిస్.. ఊహించని ఘటనతో షాకైన కాజల్!