టాలీవుడ్ లో టాప్ సినిమాటోగ్రాఫర్లలో చోటా కె నాయుడు ఒకరు. ఆయన కెమెరా వర్క్ కి ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. వయసు ఎంత పెరుగుతున్నా ఎప్పుడూ ఉత్సాహంగానే కనిపిస్తుంటారు. తాజాగా జరిగిన 'కవచం' సినిమా టీజర్ లాంచ్ లో చోటా ప్రదర్శించిన అత్యుత్సాహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సినీ తారలు ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా పలకరించుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఎదుటి వ్యక్తిని హగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే కవచం టీజర్ లాంచ్ లో చోటా కె నాయుడు స్టేజ్ మీద కాజల్ అగర్వాల్ ని కౌగించుకొని ముద్దు పెట్టేశాడు. అతడు చేసిన పనికి కాజల్ తో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీడియా ముందు ఇలాంటి పనులు చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ చోటా మాత్రం ఇలా చేయడానికి కారణం తమన్ అని అంటున్నాడు.

తమన్ రెచ్చగొట్టడం వలనే కాజల్ ని ముద్దు పెట్టుకున్నాని చెప్పాడు. దీంతో కాజల్ విషయాన్ని పెద్దది చేయకుండా.. నువ్వు చేసిన పనికి కోపం రావడం లేదు. పర్వాలేదు నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ లా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది.