ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు ఇటీవల జరిగిన 'కవచం' మూవీ టీజర్ లాంచ్ లో కాజల్ ని స్టేజ్ మీద కౌగించుకొని ముద్దుపెట్టారు. అతడి చర్యతో కాజల్ తో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఊహించని చర్యతో ఏం చేయాలో తోచక కాజల్ తన మాటలతో ఆ పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. అయితే కాజల్ అభిమానులు మాత్రం ఛోటాపై మండిపడుతున్నారు.

ఆడవాళ్లను అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తావా..? అసలు కాజల్ ని స్టేజ్ మీద ముద్దు పెట్టుకునే సాహసం ఎలా చేసావంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఛోటాపై విమర్శలు గుప్పించారు. దీంతో ఛోటా ఈ విషయంపై స్పందించక తప్పలేదు. అయితే ఆయన ఎమోషనల్ టచ్ ని జోడించి తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.

సౌందర్య తరువాత అంతగా ఇష్టపడే నటి కాజల్ అని ఆమె నటించిన చాలా సినిమాలకు కెమెరా మెన్ గా పని చేశానని ఛోటా అన్నారు. ''కాజల్ తో ఎప్పుడు పని చేసినా నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఆమె నన్ను కుటుంబసభ్యుడిలా భావిస్తుంది. మా ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది. కాజల్ ని  అభినందించడానికి మాత్రమే ఆమెకి ముద్దు పెట్టాను.

కవచం సినిమాలో ఆమె అధ్బుతంగా ముద్దు పెట్టింది. ఆమెని అభినందించడానికే నేను అలా చేశాను'' అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. మరి ఇప్పటికైనా ఈ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి!

సంబంధిత వార్తలు..

కాజల్ కి ముద్దు పెడతాడా..? అతడిని బ్యాన్ చేయండి: అభిమానుల ఆగ్రహం!

స్టేజ్ మీద హగ్, కిస్.. ఊహించని ఘటనతో షాకైన కాజల్!