కిరణ్‌ అబ్బవరం ఇప్పుడు `కే ర్యాంప్‌` అనే చిత్రంతో రాబోతున్నారు. ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదలయ్యింది. ఈ సారి కిరణ్‌ బోల్డ్ కంటెంట్‌ని, వినోదాన్ని నమ్ముకుని వస్తున్నట్టుగా ఉంది. 

కిరణ్‌ అబ్బవరం చాలా పరాజయాల అనంతరం `క` సినిమాతో హిట్‌ కొట్టాడు. మంచి కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన `దిల్‌రూబా`మూవీ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. 

ఇప్పుడు `కే ర్యాంప్‌`(K ర్యాంప్)తో రాబోతున్నారు. `రిచెస్ట్ చిల్లర్‌ గాయ్‌` అనే ట్యాగ్‌ లైన్‌ ఆసక్తిని రేకెత్తిస్తుంది. కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది.

 జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ పతాకంపై రాజేష్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

`కే ర్యాంప్‌` గ్లింప్స్ ఔట్‌

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా గ్లింప్స్ వచ్చింది. కిరణ్‌ అబ్బవరం పుట్టిన రోజు(జులై 15)ని పురస్కరించుకుని సోమవారం ఈ గ్లింప్స్ ని విడుదల చేశారు. 

ఈ గ్లింప్స్ లో మాస్ ఆటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపించారు. చిల్ కావడంలో అతనికి పోటీ లేదు. ఈ క్యారెక్టర్ ను ఫుల్ ఎనర్జీతో రచ్చ చేశారు కిరణ్ అబ్బవరం. 

ఈ గ్లింప్స్ చివరలో 'మనం ఏఎంబీ సినిమాలో మలయాళ ప్రేమకథలు చూసి హిట్ చేస్తాం, కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం. ఎందుకంటే ఆ సినిమాల్లో ఉండే ఆంథెటిసిటీ మన సినిమాల్లో ఉండదు. ప్రేమ మాత్రం బాగుండాలని కోరుకుంటాం..' అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ గ్లింప్స్ లో హైలైట్ గా నిలుస్తోంది.

మలయాళ ప్రేమ కథలపై కిరణ్‌ సెటైర్లు 

మన తెలుగు ఆడియెన్స్‌పై, మలయాళ చిత్రాలపై ఆయన చేసిన కామెంట్‌ రచ్చ అవుతుంది. 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ చూస్తే `ఎల్లవారుక్కుమ్‌ నమస్కారం, ఈ సారి ఒక్కొక్కడికి బుర్ర పాడు బుడ్డలు జారుడే` అని డైలాగ్‌తో గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. కిరణ్‌ అబ్బవరం కారులో పబ్‌కి చాలా జోష్‌గా వెళ్లాడు. డాన్సులతో చిందులేశాడు.

ఆద్యంతం బోల్డ్ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌గా `కే ర్యాంప్‌` గ్లింప్స్ 

ఇక మురళీధర్‌ గౌడ్‌ క్యారమ్స్ ఆడుతూ లైఫ్‌ ఎలా ఉందని ఉత్సాహంగా అడిగితే బూత్‌ పదంతో షాకిచ్చాడు కిరణ్‌. కాలేజీకి వెళ్లడం, ఆ తర్వాత ఓ గదిలోనుంచి బయటకు వస్తూ అమ్మాయిని చూసి సంసారికం అని చెప్పడం, 

వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తూ మందేయడం, మరోవైపు కాలేజీలో అమ్మాయిని పెన్నుతో గుచ్చడం, ఫన్నీగా తనని తాను కొట్టుకోవడం, ఆ తర్వాత పబ్‌లో విలన్లు కిరణ్‌ని కొట్టడం ఆకట్టుకునేలా ఉంది. 

అయితే పబ్‌లో మందు బాటిల్‌ని వెరైటీగా పట్టుకుని గ్లాస్‌ నింపి తాగడం క్రేజీగా ఉంది. ఈ క్రమంలో చివర్లో మలయాళ చిత్రాలపై ఆయన చేసిన కామెంట్‌, తెలుగు ఆడియెన్స్ పై వేసిన సెటైర్లు ఫన్నీగా, క్రేజీగా ఉన్నాయి.

దీపావళికి `కే ర్యాంప్‌` విడుదల 

కిరణ్‌ అబ్బవరం ఇందులో చాలా క్రేజీగా కనిపిస్తున్నారు. డైలాగ్‌లు, కంటెంట్‌ చాలా బోల్డ్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదేసమయంలో నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఫన్నీగా ఉంది. ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. 

వినోదాన్ని నమ్ముకుని కిరణ్‌ ఈ మూవీ చేశారని అర్థమవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా అనేలా ఉంది. గ్లింప్స్ మాత్రం ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 

ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నట్టు టీమ్‌ ప్రకటించింది. ఇందులో ఇతర పాత్రల్లో నరేష్,సాయి కుమార్,వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.

YouTube video player