Janhvi Kapoor: మరో స్టార్ హీరో సరసన జాన్వీ.. ఏడాదిలోనే లెక్క మార్చేసిన శ్రీదేవి తనయ!
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బ్యాక్ టూ బ్యాక్ సౌత్ ఆఫర్లని దక్కించుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా మరో స్టార్ హీరో సరసన ఎంపికైంది.
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.. ఇప్పుడు సౌత్‌లో బిజీ హీరోయిన్ అవుతుంది. ఆమె ఎన్టీఆర్‌తో నటించేందుకు ఒప్పుకోవడమే పెద్ద విశేషంగా భావించిన నేపథ్యంలో ఇప్పుడు సైలెంట్‌గా సౌత్‌లో పాగా వేసేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లని సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మరో భారీ ఆఫర్‌ని సొంతం చేసుకుంది. మరో సౌత్ స్టార్‌తో హీరోయిన్‌గా నటించే ఆఫర్‌ని దక్కించుకుంది. అయితే ఈ ఆఫర్ వెనకాల తన తండ్రినే ఉండటం విశేషం.
జాన్వీ కపూర్ ఇప్పటికే ఎన్టీఆర్‌తో `దేవర` చిత్రంలో నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో రూపొందుతున్న చిత్రమిది. కొరటాల శివ రూపొందిస్తున్నారు. సముద్రపు బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడికల్ మూవీ. ఈ మూవీతో జాన్వీ కపూర్ గ్రాండ్‌గా సౌత్ ఎంట్రీ ఇస్తుంది. తొలి చిత్రం తారక్‌తో కావడంతో ఆమె ఎంట్రీ గట్టిగానే ఉండబోతుందని చెప్పొచ్చు. దీంతోపాటు మరో స్టార్ హీరో రామ్‌చరణ్‌తోనూ నటించే ఛాన్స్ దక్కించుకుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో `ఆర్‌సీ16`లో ఈ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మర్ లోనే ఈ సినిమా ప్రారంభం కాబోతుంది.
ఇదిలా ఉంటే మరో స్టార్ హీరో సరసన నటించే ఆఫర్‌ని జాన్వీ సొంతం చేసుకుంది. సూర్యతో కలిసి నటించే ఆఫర్‌ని దక్కించుకుంది. సూర్య హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `కర్ణన్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని ఎంపిక చేసినట్టు బోనీ కపూర్ తాజాగా వెల్లడించారు. అలాగే జాన్వీ రామ్‌చరణ్ మూవీని కూడా ఆయన ఖరారు చేయడం విశేషం.
Also read: ప్రభాస్, ఎన్టీఆర్ నా ఫేవరేట్... ఆ స్టార్ క్రికెటర్ బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చాలా సార్లు చూశాడట!
ఇలా ముగ్గురు టాప్ స్టార్స్ తో చేస్తుంది జాన్వీ. ఈ దెబ్బతో ఆమె లెక్క మారిపోతుంది. మోస్ట్ బిజీయెన్స్, క్రేజీయెస్ట్ హీరోయిన్‌గా మారబోతుందని చెప్పొచ్చు. `దేవర` హిట్ అయితే జాన్వీ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతుంది. ఆమ రేంజ్ కూడా పెరిగిపోతుంది. మరి తల్లి శ్రీదేవిలా నార్త్ తోపాటు సౌత్‌ని కూడా ఓ ఊపు ఊపేస్తుందా అనేది చూడాలి. కానీ బోనీ కపూర్ మాత్రం ఆ దిశగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
Read more: kalki trailer: `కల్కి` ట్రైలర్ వచ్చేది అప్పుడే?.. వరుసగా సర్ప్రైజ్‌లు ప్లాన్