Asianet News TeluguAsianet News Telugu

kalki trailer: `కల్కి` ట్రైలర్‌ వచ్చేది అప్పుడే?.. వరుసగా సర్ప్రైజ్‌లు ప్లాన్‌

`కల్కి` సినిమా నుంచి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ అప్‌డేట్‌ విపిపించింది. 
 

prabhas kalki movie trailer update and surprizes when will come ? arj
Author
First Published Feb 20, 2024, 2:49 PM IST | Last Updated Feb 20, 2024, 2:49 PM IST

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్‌ చేస్తుంది. అంతటి అంచనాలను పెంచేసిందీ మూవీ. ఇటీవల మ్యూజిక్‌ డైరెక్టర్‌ నిర్వహించిన కాన్సర్ట్ లో ఆయన ఈ సినిమాకి సంబంధించిన బీజీఎంని ప్లే చేశారు. దీనికి విశేష స్పందన లభించింది. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. విజువల్స్ తో థియేటర్లలో చూస్తే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం అనేలా మెప్పించారు. 

ఇక సినిమా రిలీజ్‌కి టైమ్‌ దగ్గర పడుతుంది. ఇంకా మూడు నెలలు కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బిజినెస్‌ జరుగుతుందట. హిందీ వెర్షన్‌ రికార్డు స్థాయిలో అమ్ముడు పోయిందని అంటున్నారు. ఏకంగా 145కోట్లకి నార్త్ రైట్స్ అమ్ముడు అయ్యాయని తెలుస్తుంది. ఇది ఇండియన్‌ సినిమాలోనే అత్యధిక రేటుకి అమ్ముడు పోయిన మూవీగా నిలిచింది. 

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి క్రేజీఅప్‌డేట్‌ వినిపిస్తుంది. సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఏప్రిల్‌ మొదటి వారంలో `కల్కి2898ఏడీ` ట్రైలర్‌ని విడుదల చేయాలని భావిస్తున్నారట. అంతేకాదు మార్చి 8న ఈ విషయాన్ని వెల్లడిస్తారని తెలుస్తుంది. అదే రోజున కొత్త పోస్టర్‌ రాబోతుందని, అది చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. మరోవైపు సినిమా విడుదలపై అనేక అనుమానాలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో మార్చి 8న ఆ విషయంపై క్లారిటీ వస్తుందట. అందుకోసం అభిమానులు ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. సినిమాకి వీఎఫ్‌ఎక్స్ కంప్లీట్‌ కాలేదు. పలు కంపెనీలు వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అనుకున్న సమయంలో ఆ వర్క్ కంప్లీట్‌ అయితే సినిమా మే 9న రాబోతుంది. లేదంటే వాయిదా పడుతుందని సమాచారం. ఇక ప్రభాస్‌ కి జోడీగా దీపికా పదుకొనె, దిశా పటానీ, కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దీన్ని సైన్స్ ఫిక్షన్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios