ఒకప్పుడు తెలుగు సినిమా సౌత్ ఇండియాకు పరిమితం. ఇప్పుడు ప్రపంచ సినిమా దిగ్గజాల నోటి వెంట కూడా తెలుగు సినిమా పేరు వినిపిస్తోంది. కాగా ఒక స్టార్ ఇండియన్ క్రికెటర్ కి ప్రభాస్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అట.  

భారత స్టార్ క్రికెటర్స్ లో మహమ్మద్ షమీ ఒకరు. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ లో షమీ చెలరేగిపోయాడు. ప్రతి మ్యాచ్ లో వికెట్స్ తీస్తూ ఫార్మ్ కొనసాగించాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ లో ఇండియా ఓడినప్పటికీ జట్టు సభ్యుల ప్రదర్శనకు క్రీడాభిమానులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే షమీకి సౌత్ ఇండియా స్టార్స్ లో వారిద్దరూ ఫేవరేట్ హీరోలు అట. 

ప్రభాస్, ఎన్టీఆర్ తనకు ఇష్టమైన హీరోలని షమీ ఇటీవల చెప్పుకొచ్చారు. వారి నటన ఆయనకు బాగా నచ్చుతుందట. అలాగే ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2... ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పలుమార్లు చూశాడట. ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ తమ హీరోల అభిమాని కావడంతో ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. 

ప్రభాస్, ఎన్టీఆర్ లను పాన్ ఇండియా స్టార్స్ గా మలచిన బాహుబలి సిరీస్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు దర్శకుడు రాజమౌళి కావడం విశేషం. బాహుబలి 2 ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. ఇక ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా రాబట్టింది. ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టింది. 

కాగా ప్రభాస్ ఒకటికి మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. కల్కి 2829 AD, రాజా సాబ్ సెట్స్ పై ఉన్నాయి. కల్కి మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర ఏప్రిల్ 5న విడుదల కావాల్సింది. షూటింగ్ పూర్తి కాలేదు. అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల చేస్తున్నారు.