అనంత్ అంబానీ ఎంగేజ్ మెంట్.. రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో హాజరైన జాన్వీ కపూర్.. వైరల్ వీడియో!
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సినిమాలతో అలరిస్తూనే ఇటు పలు వేడుకలకూ హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా అనంత్ అంబానీ ఎంగేజ్ మెంట్ కు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాజరవడం హాట్ టాపిక్ గా మారింది.

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం నార్త్ లో అందరికీ పరిచయమే. స్టార్ కిడ్ గా ఇటు తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా తెలుసనే చెప్పాలి. అటు సినిమాలతో పాటు ఇటు పలు ఈవెంట్లకూ హాజరవుతూ సందడి చేస్తోంది. పార్టీలు, స్పెషల్ ఈవెంట్లు, ఫంక్షన్లకు వెళ్తూ కనువిందు చేస్తోంది. అయితే, నిన్న భారత దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ నిశ్చితార్థం రాధికా మర్చెంట్ తో జరిగిన విషయం తెలిసిందే.
ఈ వేడుకకు దేశంలోని బిగ్ షాట్స్ హాజరయ్యారు. ఈ క్రమంలో సినీ తారలు కూడా సందడి చేశారు. రన్వీర్ సింగ్, రన్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఇదే వేడుకకు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హాజరై సందడి చేసింది. అయితే వేడుకలో జాన్వీ తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా (Shikhar Pahariya)తో కలిసి కనిపించింది. అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుకకు వారిద్దరూ హాజరవడం విశేషం. ఈ సందర్భంగా పార్టీ నుంచి బయటికి వచ్చిన కొన్ని వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
శిఖర్ పహారియాతో కొన్ని ఏండ్ల కిందనే జాన్వీ డేటింగ్ లో ఉందని అంటున్నారు. కొన్ని కారణాలతో విడిపోయారని తెలుస్తోంది. ఈ క్రమంలో మళ్లీ వేడుకలో కనువిందు చేయడంతో ఇంకా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారా అని అభిమానులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు నిశ్చితార్థ వేడుకలో లేత బేబీ పింక్ శారీలో ఆకట్టుకుంది. ట్రాన్ఫరెంట్ చీరలో అందాలను ఆరబోసింది. ట్రెడిషనల్ లుక్ లో మతులు పోగొట్టింది.
బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్ కూ త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం ‘ఎన్టీఆర్ 30’లో హీరోయిన్ గా అలరించబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ‘బావాల్’ చిత్రంలో నటిస్తోంది. వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతోంది. అలాగే రాజ్‌కుమార్ రావుతో పాటు ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’లో నటిస్తోంది.