జ్యోతిష్యంలో ఉన్నట్లుగానే నటుడి సోదరుడు మృతి.. ఆ రెండూ చెప్పినట్లే జరిగాయి

జ్యోతిష్యం నిజమని కొందరు నమ్ముతారు.. మూఢనమ్మకమని మరికొందరు కొట్టిపారేస్తారు. అది నిజమైన, అబద్దం అయినా ప్రస్తుత పరిస్థితులకు సెట్ కాదనేది మరికొందరి వాదన. కానీ జ్యోతిష్యాన్ని బలంగా విశ్వసించే సెలబ్రిటీలు ఉన్నారు.

Jackie Shroff narrates how his astrologer father predicted that something bad

జ్యోతిష్యం నిజమని కొందరు నమ్ముతారు.. మూఢనమ్మకమని మరికొందరు కొట్టిపారేస్తారు. అది నిజమైన, అబద్దం అయినా ప్రస్తుత పరిస్థితులకు సెట్ కాదనేది మరికొందరి వాదన. కానీ జ్యోతిష్యాన్ని బలంగా విశ్వసించే సెలబ్రిటీలు ఉన్నారు. వారిలో బాలీవడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ ఒకరు. విలన్ రోల్స్ తో జాకీ ష్రాఫ్ తిరుగులేని నటుడిగా గుర్తింపు పొందారు. 

సౌత్ లో కూడా అనేక చిత్రాల్లో జాకీ ష్రాఫ్ నటించారు. పంజా, సాహో, బిగిల్ లాంటి చిత్రాల్లో జాకీ ష్రాఫ్ నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా జాకీ ష్రాఫ్ తనకు జ్యోతిష్యంపై బలమైన నమ్మకం ఉందని తెలిపారు. అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా హోస్ట్ గా చేస్తున్న ఓ టీవీషోలో పాల్గొన్న జాకీ ష్రాఫ్ జ్యోతిష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

నాకు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడే మా సోదరుడు మరణించాడు. అప్పటికి మా సోదరుడి వయసు 17 ఏళ్ళు. ఆ రోజు మా సోదరుడి మరణాన్ని మా నాన్ని ముందే ఊహించారు. మా నాన్నకు జోతిషంపై అవగాహన ఉంది. మా అన్న ఓ ఫ్యాక్టరీలో పనికి వెళుతుండేవాడు. ఆరోజు జ్యోతిష్యం ప్రకారం బాగాలేదని.. మా అన్నకు గండం ఉందని మా నాన్న హెచ్చరించారు. ఇంట్లో నుంచి ఎక్కడకు వెళ్లోద్దని చెప్పారు. 

కానీ నాన్న చెప్పిన మాటలు అన్న వినలేదు. దీనితో ఇంట్లోనుంచి బయటకు వెళ్ళాడు. సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించే క్రమంలో మా అన్న కూడా మరణించాడు. నా సోదరుడి జ్ఞాపకాలు ఇప్పటికి మా ఫ్యామిలీని వెంటాడుతూనే ఉన్నాయి. జ్యోతిష్యం ప్రకారం మా నాన్న మరొక విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పారు. నువ్వు చాలా పెద్ద నటుడివి అవుతావు అని చిన్నతనంలోనే నాన్న చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే నేను నటుడిని అయ్యా. జ్యోతిష్యంపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరైతే జ్యోతిష్యాన్ని అపహాస్యం చేస్తుంటారు. నమ్మకపోయినా పర్వాలేదు.. అలా అపహాస్యం మాత్రం చేయవద్దని జాకీ ష్రాఫ్ సూచించారు.  

Also Read: ఏపీలో 175 థియేటర్లు క్లోజ్.. RRR, రాధే శ్యామ్ పరిస్థితి ఏంటి ?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios