టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు విజయ్ దేవరకొండ క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎక్కువగా యువతని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి చిత్ర ప్రభావం కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాలేదు. 

ఆ చిత్రం సాధించిన సక్సెస్ చూసి బాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. అర్జున్ రెడ్డి మూవీని హిందీలో, తమిళంలో కూడా రీమేక్ చేశారు. విజయ్ దేవరకొండకు బాలీవుడ్ సర్కిల్స్ లో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా కాలంగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

ఇటీవల బాలీవుడ్, సౌత్ చిత్ర ప్రముఖులతో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నాడు. బాలీవుడ్ క్రేజీ సెలెబ్రిటీలు దీపికా పదుకొనె, అలియా భట్, రణ్వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండకు ఓ ప్రశ్న ఎదురైంది. ఇండియాలో ఉన్న ఏ నటుల సలహాలు తీసుకుంటారు అని ప్రశ్నించారు. నాకు నచ్చే నటులు ఎందరో ఉన్నారు. వారిలో దీపికా, అలియా భట్ లాంటి హీరోయిన్లపై క్రష్ కూడా ఉంది. మొదట దీపికని లవ్ చేసేవాడిని. ఆమెకు పెళ్లైపోయింది. ఇప్పుడు అలియా భట్ ని లవ్ చేస్తున్నా అని విజయ్ దేవరకొండ సరదా కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండ ఇలా కామెంట్ చేస్తుండగానే పక్కనే ఉన్న దీపికా పదుకొనె స్పందించింది. 

క్రేజీ కమెడియన్ తో నటి సీక్రెట్ మ్యారేజ్ ?.. ఫోటో వైరల్!

అలియా భట్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అని దీపికా అనుకోకుండా చెప్పేసింది. అలియా భట్ స్పందిస్తూ.. నా పెళ్లి గురించి ఎందుకు చెబుతున్నావ్ అని ప్రశ్నించింది. అందరూ అనుకుంటున్నదే నేను కూడా చెబుతున్నా అని దీపికా ఫన్నీగా రిప్లై ఇచ్చింది. 

వరుణ్ తేజ్ కి హ్యాండిచ్చిన రాంచరణ్ హీరోయిన్.. పూరి హీరోయిన్లకు ఛాన్స్!

దీపికా పదుకొనె అలియా పెళ్లి గురించి నోరు జారడంతో బాలీవుడ్ లో ఆసక్తికర చర్చ మొదలయింది. అలియా భట్, రణబీర్ కపూర్ ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్నారు. చాలా రోజులుగా వీరిద్దరి వివాహం గురించి వార్తలు వస్తున్నా.. అలియా, రణబీర్ మాత్రం నోరు మెదపడం లేదు. దీపికా వ్యాఖ్యలతో ఈ జంట త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తేలిపోయింది.