మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ లో క్రమంగా క్రేజీ హీరోగా మారుతున్నాడు. ప్రతి చిత్రానికి వరుణ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ పోతోంది. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. హరీష్ శంకర్ దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వరుణ్ రఫ్ లుక్ లో అదరగొట్టాడు. 

వరుణ్ తేజ్ తొలిసారి మాస్ లుక్ లో కనిపించిన చిత్రం ఇది. అదే జోరుని కొనసాగించేలా వరుణ్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. డెబ్యూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించ్చబోయే చిత్రంలో వరుణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. 

దీనికోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ పొందుతున్నాడు. ఆసక్తి రేపుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీని అనుకున్నారు. కియారా తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. దీనితో ఆమె వరుణ్ మూవీలో నటించడం సాధ్యం కాదట. కియారా అద్వానీ అయితే ఈ చిత్రంలో పర్ఫెక్ట్ గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో కొత్త హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. 

కియారా నో చెప్పడంతో ఆమె స్థానంలోకి ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కి కూడా అవకాశం ఉందట. సెకండ్ హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోనే హీరోయిన్ గా నటించిన నభా నటేష్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత మరోసారి ఈ ముద్దుగుమ్మలిద్దరూ కలసి నటించబోతున్నారు. 

రూ.40 కోట్లతో వరుణ్ తేజ్ సినిమా.. అతడి రెమ్యునరేషన్ ఎంతంటే..?

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రం కావడంతో బడ్జెట్ కూడా భారీగా ఖర్చవుతుందట. ఈ చిత్రానికి అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాత. దాదాపు 40 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరుణ్ మార్కెట్ కంటే ఎక్కువే.