చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాల గురించి, పెళ్లిళ్ల గురించి అనేక రూమర్లు వినిపిస్తుంటాయి. అందులో కొన్ని రూమర్లు నిజమైతే.. మరికొన్ని గాలి వార్తలుగానే మిగిలిపోతాయి. తమ ప్రేమ, పెళ్లి లాంటి వ్యవహారాల గురించి సెలెబ్రిటీలు మీడియాలో స్పందించడానికి ఇష్టపడరు. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే తమ వ్యక్తిగత విషయాలని పంచుకుంటారు. 

ప్రస్తుతం తమిళంలో యోగి బాబు కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. పలు చిత్రాల్లో యోగిబాబుకు అవకాశాలు వస్తున్నాయి. తాజాగా యోగి బాబు, తమిళ నటి సబితా రాయ్ గురించి ఆసక్తికర రూమర్స్ ప్రచారం అయ్యాయి. వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. 

గుర్తుపట్టలేని విధంగా నయనతార.. వైరల్ అవుతున్న వీడియో!

యోగిబాబు, సబితా రాయ్ ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్న ఓ ఫోటో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాము రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వస్తున్న వార్తలని యోగి బాబు, సబితా ఇద్దరూ ఖండించారు. నా వివాహం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఒక వేళ నేను వివాహం చేసుకుంటే ఆ విషయాన్ని ముందుగానే ప్రకటిస్తా అని యోగిబాబు స్పందించాడు. 

చైతు కోసం మోకాలిపై వెయ్యి మెట్లు ఎక్కిన అభిమాని.. స్పందించిన సమంత!

నటి సబిత కూడా ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. తనకు యోగి బాబు మంచి స్నేహితుడు మాత్రమే అని తెలిపింది. వివాహానికి సంబంధించిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. మా ఇద్దరి మధ్య వృత్తిపరమైన రిలేషన్ షిప్ తప్ప మరేం లేదు.  ఇక ఈ రూమర్లకు స్వస్తి చెప్పండి అని సబిత కోరింది. 

యోగి బాబు, సబిత 2017లో విడుదలైన 'కాన్ని రాసి' చిత్రంలో నటించారు.