- Home
- Entertainment
- TV
- Illu Illalu Pillalu Today:మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా పరువు పోతుంది.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు , షాక్ లో వల్లి
Illu Illalu Pillalu Today:మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా పరువు పోతుంది.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు , షాక్ లో వల్లి
Illu Illalu Pillalu : శ్రీ వల్లి, భాగ్యం కలిసి.. అమూల్య పెళ్లి చూపులు చెడగొడతారు. దీంతో.. రామరాజు మరో సంబంధం కుదర్చాలని అనుకుంటాడు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీకోసం..

ఇల్లు ఇల్లాలు పిల్లలు..
అమూల్య విషయంలో ప్రేమ తప్పుగా మాట్లాడిందనే కోపం ధరీజ్ కి పోదు. దీంతో.. ధీరజ్ కోపం పోగొట్టేందుకు ప్రేమ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ధీరజ్ డ్యూటీకి వెళ్లే సమయానికి అతనికి సంబంధించిన కారు కీ, అతని డ్రెస్ అన్నీ దాచి పెడుతుంది. వాటి కోసం ధీరజ్ వాళ్ల అమ్మని పిలుస్తాడు. కానీ.. వేదవతిని వెళ్లనివ్వకుండా నర్మద ఆపుతుంది. అవన్నీ ప్రేమ తన దగ్గరే పెట్టుకుంటుంది. అమూల్యకు సంబంధం మాట్లాడటానికి వెళ్తున్నామని నర్మదకు చెప్పి వేదవతి కూడా బయలు దేరుతుంది. అయితే.. వెళ్లే ముందు కాస్త భయపడుతుంది.. ఈ సంబంధం కుదురుతుందో లేదో అని.. అయితే.. నర్మద ధైర్యం చెబుతుంది. దీంతో.. రామరాజు, వేదవతి సంతోషంగా బయలుదేరతారు.
ఇక.. ధీరజ్ వాళ్ల అమ్మని పిలుస్తూ బయటకు వస్తాడు. తనకు కావాల్సిన వస్తువులన్నీ ప్రేమ దగ్గర ఉండటం ధీరజ్ కంట పడుతుంది.‘ ఏరా.. నేను పిలిచినా పట్టించుకోకుండా మారాం చేస్తావా? బెట్టు చేస్తావా.. ఇప్పుడు ఎలా మాట్లాడకుండా ఉంటావో చూస్తా’ అని ప్రేమ అనుకుంటుంది. కానీ.. ధీరజ్.. ఆ చొక్కా లేదని.. మరో చొక్కా వేసుకుంటాడు. అయితే.. కారు కీస్ లేకుండా ఎలా వెళ్తావ్ అని ప్రేమ అనుకుంటుంది. అయితే.. ధీరజ్ తెలివిగా.. తన బాస్ కి ఫోన్ చేసి.. డూప్లికేట్ కీ పంపించమని అడుగుతాడు. పనిలో పనిగా.. ప్రేమను చుంచు ఎలక, పందికొక్కు అని కూడా పిలుస్తాడు. ఏం చేసినా.. పట్టించుకోకుండా.. ప్రేమతో మాట్లాడకుండానే వెళ్లిపోతాడు. ధీరజ్ అలా మాట్లాడకుండా వెళ్లిపోవడంతో.. ప్రేమ చాలా హర్ట్ అవుతుంది.
మీ అమ్మాయిని చేసుకుంటే.. మా పరువు పోతుంది..
ఇక రామరాజు, వేదవతి.. అమూల్య పెళ్లి చూపులకోసం వేరే వాళ్ల ఇంటికి వెళతారు. వెళ్లి వాళ్లతో.. అమూల్య చదువు కోసం ఇంతకాలం పెళ్లి చేయకుండా ఆగామని.. ఇప్పుడు పెళ్లి చేయాలి అనుకుంటున్నామని.. రామరాజు చెబుతాడు. ‘ అంత్య నిష్టూరం కన్నా.. ఆది నిష్టూరం మేలు అని.. మీ అమ్మయిని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు’ అని వనజ( కొత్త క్యారెక్టర్) అంటుంది. ‘ అమూల్యతో మాకు సమస్య లేదు..మీ ఇంటి గురించే మాకు సమస్య.. మీ ఇంట్లో రెండు పెళ్లిళ్లు లేచి పోయి జరిగినయే కదా.. అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని.. పద్దతిగల ఇంటికి ఎలా తెచ్చుకోవాలి? ఇది మాకు పరువు తక్కువే కదా.. నేను మాట్లాడింది నిజం కాదా’ అని వనజ అడుగుతుంది.
‘ నువ్వు ఈ మాట అన్నావ్ కాబట్టి చెబుతున్నాను.. నా బిడ్డను మీ ఇంటి కోడలు చేసుకుంటారో లేదో మీ ఇష్టం. కానీ.. ఇప్పుడు నువ్వు అన్నావ్ కదా.. నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావ్ అని .. దానికి నేను చెప్పేది ఒకటే. మన తరం వేరు.. ఇప్పటి పిల్లల తరం వేరు. మన మాటే నెగ్గాలని, మన మాటే వినాలని, మన అభిప్రాయలను పిల్లల మీద రుద్దితే.. వాళ్ల కోరికలు నిజం చేసుకోలేక.. వారి జీవితాలు నరకప్రాయం అవుతాయి. ఆ ఉద్దేశంతోనే పిల్లల అభిప్రాయాలను అంగీకరించాను తప్ప..తల వంచలేదు.. ఇప్పుడు కూడా నా కోడళ్లను చూసి తల ఎత్తుకొని బతుకుతున్నాను. నిజం చెప్పాలంటే.. నా కొడుకుల కంటే.. నా ఇద్దర కోడళ్లను చూసే నేను ఎక్కువ గర్వ పడతాను. నేను ఏదో మీ అభిప్రాయాలను కించపరుస్తున్నాను అనుకోవద్దు’ అని రామరాజు చెబుతాడు.
పెళ్లి సంబంధం ఒకే అయిపోయినట్లే..
‘ వనజ... పిల్లల అభిప్రాయాన్ని గౌరవించారు కాబట్టే..వాళ్లు ఇప్పుడు కూడా తమ పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటున్నారు.. ఎటూ మన కొడుక్కి అమూల్య అంటే ఇష్టం అని చెప్పాడు కదా.. మనం మన అబ్బాయి ఇష్టాన్ని ఎందుకు కాదు అనాలి? ఒక్కసారి ఆలోచించు..’ అని వనజ భర్త చెబుతాడు. ‘ మా వారు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. పైగా మీరు పిల్లల మాటకు గౌరవం ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాం అని అన్నారు.. ఇంకా చెప్పాలి అంటే ఇంటి కోడళ్ల గురించి అంత గొప్పగా మాట్లాడారు.. మీ సంస్కారం మాకు నచ్చింది.. మీ సంబంధం మాకు ఇష్టమే అన్నయ్య’ అని వనజ అంటుంది. ఆ మాట విని రామరాజు, వేదవతి సంతోషిస్తారు. మంచిరోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం అని వేదవతి అంటుంది. ‘ చెల్లెమ్మ.. మీకు ఏం కావాలో మొహమాట పడకండి.. మా ముద్దుల కూతరు ఇంత మంచి ఇంట అడుగుపెడుతున్నందుకు.. ఏం కావాలో అడగండి’ అని రామరాజు అంటాడు. ఈ పెళ్లి సంబంధం నిశ్చయమైనందుకు పెళ్లి కొడుకు దూరం నుంచే విని సంతోషిస్తాడు. ఇక సంబంధం కుదిరినందుకు సంతోషంగా వాళ్లు అక్కడి నుంచి బయలుదేరతారు.
కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..
అత్త, మామలు ఇంకా ఇంటికి రాలేదని.. పెళ్లి సంబంధం ఎక్కడ కుదిరిపోతుందా అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే రామరాజు భార్య వేదవతితో కలిసి ఇంటికి వస్తాడు.‘ వీళ్ల ముఖాలు చూస్తుంటే పెళ్లి సంబంధం కుదరలేదు అనిపిస్తోంది’ అని శ్రీవల్లి సంబరపడిపోతూ ఉంటుంది. ఈలోగా..వేదవతి తన కుటుంబ సభ్యులు అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చి ఏమైంది అని అడిగితే.. రామరాజు చెబతాడు అని వేదవతి అంటుంది.
రామరాజు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి కొడుకులు కంగారుపడితే... సంబంధం కుదరలేదని వల్లి సంబరపడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు మాట్లాడటం మొదలుపెడతాడు.‘ ఇవి కన్నీళ్లు కాదురా.. ఆనంద బాష్పాలు.మీ చెల్లికి మంచి సంబంధం కుదిరింది’ అని చెబుతాడు. వల్లీ, అమూల్య తప్ప.. అందరూ సంతోషిస్తారు. ‘ చాలా మంచి కుటుంబం రా డబ్బు కంటే.. పరువు, మర్యాదలకు ఎక్కువ విలువ ఇస్తారు. వనజగారు అని గోదావరి అవతల ఉంటారు.. ఆవిడ మార్కెట్ ప్రెసిడెంట్. అబ్బాయి సాఫ్ట్ వేర్.. చాలా బాగుంటాడు’ అని వేదవతి చెబుతుంది.
‘గత కొద్ది రోజులుగా నీ గురించి చాలా బాధ పడ్డాను. నా బంగారు తల్లి జీవితం ఏమైపోతుందా అని బాధపడ్డాను. కానీ తెల్లారేసరికి ఇంత మంచి వార్త నేను వినేలా దేవుడు చూశాను. నీ జీవితం బాగుంటుంది. నా దిగులు అంతా తీరిపోయినట్లే’ అని కూతురుతో రామరాజు అంటాడు. అందరూ స్వీట్లు తింటారు. అన్నలు అందరూ కలిసి అమూల్యను ఆటపట్టిస్తూ ఉంటారు. కానీ అమూల్య ఫేస్ మాడిపోయి ఉంటుంది. ఓ వైపు వల్లి కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఈ విషయం విశ్వక్ తెలిస్తే.. మా పరిస్థితి ఏంటి అని వల్లి కంగారుపడుతూ ఉంటుంది.
తల్లి దగ్గరకు పరుగులు తీసిన వల్లీ..
ఇక.. అమూల్య తండ్రి చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వక్ కి ఫోన్ చేస్తుంది. ‘ మన బంధం విడదీయరానిది అనడానికి ఇదే నిదర్శనం.. మన పెళ్లి తర్వాత నిన్ను ఎలా చూసుకోవాలి.. ఎంత ప్రేమగా చూసుకోవాలి అని ఆలోచిస్తున్నా.. అంతలోనే నువ్వు ఫోన్ చేశావ్ అని విశ్వక్ అంటాడు’ వెంటనే అమూల్య.. ‘ రేపు నాకు ఎంగేజ్మెంట్... మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేశాడు..పెళ్లి కూడా వెంటనే చేస్తారేమో అని భయంగా ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో నాకు తెలీడం లేదు.. పెళ్లి చూపులు చెడగొట్టినట్లే..ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టవా’ అని అమూల్య అడుగుతుంది. దీంతో.. ఆ సంగతి నేను చూసుకుంటాను అని విశ్వ ధైర్యం చెబుతాడు. ఫోన్ పెట్టేశాక.. ఎంగేజ్మెంట్ ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తాడు.
మరోవైపు వల్లి భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది. వాళ్ల అమ్మ , నాన్న ఇడ్లీ కొట్టు దగ్గరకు వెళ్తుంది.ఇడ్లీ బాబాయ్ మాత్రం భాగ్యంతో సరసాలు ఆడుతూ ఉంటాడు. ఆమె విసుక్కుంటుంది. ఈలోగా.. ఎవరో కస్టమర్ వస్తే ఇడ్లీ కావాలా అని అడుగుతాడు. అయితే.. ఒకడు వచ్చి.. ఇలా రోడ్డు మీద ఫుడ్ తినకూడదు..చాలా చీప్ అని అంటాడు. తమ టిఫిన్ ని చీప్ అన్నందుకు భాగ్యం అతన్ని చితక్కొడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

