అజిత్  సినిమాపై హైకోర్టులో కేసు వేశారు ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్  ఇళయరాజా. కారణం ఏంటంటే? 

సౌత్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై ఇళయరాజా హైకోర్టులో కేసు వేశారు. తన పాటలను అనుమతి లేకుండా సినిమాలో వాడారని, కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసును సోమవారం విచారిస్తామని కోర్టు తెలిపింది. అయితే, పాటలకు సంబంధించిన అసలు హక్కుదారుల నుంచి అనుమతి తీసుకున్నామని సినిమా నిర్మాతలు చెబుతున్నారు.

ఏప్రిల్ పది న గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్లలోకి వచ్చింది. ఏప్రిల్ 15న ఇళయరాజా లీగల్ నోటీసు పంపించారు. సినిమాలో తన మూడు పాటలను అనుమతి లేకుండా వాడారని ఆయన ఫిర్యాదు చేశారు. 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని, ఏడు రోజుల్లోగా పాటలను సినిమా నుంచి తొలగించాలని నోటీసులో డిమాండ్ చేశారు. డబ్బులివ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇళయరాజా హెచ్చరించారు. ఇంతకు ముందు కూడా తన పాటలను అనుమతి లేకుండా వాడినందుకు చాలా మంది సినిమా వాళ్లకు ఇళయరాజా నోటీసులు పంపారు.

ఆదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. రిలీజ్ అయిన ఐదు రోజుల్లో దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. యాక్షన్ సినిమాగా వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీలో సునీల్, షైన్ టామ్ చాకో, ప్రసన్న, జాకీ ష్రాఫ్, ప్రభు, యోగి బాబు, త్రిష, ప్రియా వారియర్, సిమ్రాన్ వంటి పెద్ద తారాగణం నటించింది. పుష్ప నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్, టి సిరీస్ నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.